Begin typing your search above and press return to search.

బాబుతో ఆగిన సంప్రదాయం, జగన్ తో మొదలు!

By:  Tupaki Desk   |   24 Sept 2020 11:15 AM IST
బాబుతో ఆగిన సంప్రదాయం, జగన్ తో మొదలు!
X
చాలామంది ఊహించినట్లుగా డిక్లరేషన్ ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేశారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల చేరుకున్నారు. నేరుగా ఢిల్లీ నుండి సాయంత్రం తిరుమలకు చేరుకున్న జగన్ కొద్దిసేపు గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయంలోకి వెళ్ళి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పించిన తర్వాత జగన్ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడోత్సవంలో కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రహ్మోత్సవాలంటే తొమ్మిది రోజుల్లో జరిగే ప్రతి ఉత్సవమూ ఇంపార్టెంటే కానీ గరుడోత్సవం, రథోత్సవం మాత్రం చాలా కీలకమైపోయాయి. అందుకనే ముఖ్యమంత్రులు చాలా సంవత్సరాల పాటు గరుడసేవ రోజున పట్టువస్త్రాల సమర్పిస్తున్నారు. గతంలో ఇదే విషయమై తిరుమలకు వెళుతున్న చంద్రబాబుకు ప్రమాదం జరిగిన కారణంగా ఆనవాయితీ మారింది. మళ్ళీ ఇపుడు గరుడసేవ రోజున పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీని జగన్ పునఃప్రారంభించారు.

జగన్ ఆలయంలోకి ప్రవేశించే సందర్భంగా టీటీడీ నుంచి అసలు డిక్లరేషన్ అంశమే చర్చకు రాలేదు. పోలీసుల కట్టడితో అసలు ఎక్కడా నిరసనలు కనపడకుండా చేసేశారు. సాధారణ భక్తుల నుంచి, జనాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో సీఎం జగన్ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. జరిగిన రచ్చంతా రాజకీయ పార్టీల్లో, మీడియాలో మాత్రమే కనిపించింది. వివాదం పాలపొంగు లేచి అదే పద్దతిలో చల్లారిపోయింది. జగన్ ను అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు, బిజెపి నేతలు ఇచ్చిన పిలుపి విజయవంతం కాలేదు. అందుకనే జగన్ తిరుమల పర్యటన ప్రశాంతంగా జరిగిపోయింది.