Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తిస్తూనే...మంచి చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   15 March 2017 6:08 PM GMT
ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తిస్తూనే...మంచి చెప్పిన జ‌గ‌న్‌
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 2017-18 బ‌డ్జెట్‌పై జ‌గ‌న్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. అనంత‌రం ఓ విలేక‌రి వ‌చ్చే మార్చినాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయపార్టీగా అవతరిస్తుందని, 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని పవన్‌ ప్రకటించిన సంగ‌తిని ప్ర‌స్తావిస్తూ మీరు ఏమంటారని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. దీనికి జ‌గ‌న్ స్పందిస్తూ తాను ప్రెస్‌ మీట్‌ పెట్టింది ఏపీ బడ్జెట్ లోటుపాట్ల గురించి పేర్కొంటూ..పవన్‌ కల్యాణ్ గురించి మనకెందుకబ్బా అని అన్నారు.

అయితే జ‌న‌సేన ప్ర‌జాస‌మ‌స్య‌ల అజెండాతో ముందుకు వెళ్లాల‌నుకుంటున్న విష‌యాన్ని మ‌రొక‌రు ప్ర‌స్తావించ‌డంతో...జ‌గ‌న్ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎవరూ పోరాటం చేసినా తాము స్వాగతిస్తామని ప్ర‌క‌టించారు. అది జ‌న‌సేన అయినా మ‌రే పార్టీ అయిన ప్ర‌జా స‌మ్య‌ల‌పై పోరాటం చేసే వారికి వైసీపీ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ వ్య‌వ‌హార‌శైలిని జ‌గ‌న్ ఆస‌క్తిక‌రంగా విశ్లేషించారు. ఏపీ సీఎం చంద్రబాబు సిట్‌ అంటే సిట్‌...స్టాండ్‌ అంటే స్టాండ్ అన్న‌ట్లుగా పవన్‌ కల్యాణ్ ఉన్నారు. ఆయన ఆ పరిస్థితి నుంచి మారాలి, సమస్యలపై పోరాటం చేయాలని కోరుకుంటున్నాను# అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.