Begin typing your search above and press return to search.
జగన్ ముఖానికి మాస్కు పెట్టేలా చేసిన ప్రధాని మోడీ
By: Tupaki Desk | 5 Oct 2020 11:09 PM ISTరెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులంతా ముఖానికి మాస్కుపెట్టేస్తుంటారు. కానీ.. ఇద్దరు ప్రముఖులు మాత్రం మాస్కు పెట్టుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. వారిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. మరొకరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొంతలో కొంత బెటర్ అన్నట్లుగా కేసీఆర్ అప్పుడప్పుడు మాస్కు పెట్టటం.. తర్వాతి కాలంలో మెడలో వేసుకునే కండవాను కవర్ చేసుకుంటూ.. ఆయన స్థాయిలో ఆయన కిందా మీదా పడుతుంటారు.
ఇక.. జగన్ విషయానికి వస్తే.. ఎదుటోళ్లు ఎవరైనా ఆయన ముఖానికి మాస్కు పెట్టరు. ఎక్కడకు వెళ్లినా ఆయన గతంలో ఎలా అయితే వెళ్లేవారు అలానే వెళతారే తప్పించి.. కరోనా వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా తీసుకున్నట్లు కనిపించరు. ముఖానికి మాస్కుపెట్టుకోవటాన్ని ఏ మాత్రం ఇష్టపడరు. మొన్నటికి మొన్న తిరుపతి శ్రీవారికి పట్టువస్త్రాల్ని సమర్పించేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆ సందర్భంగా జగన్ ను చూసేందుకుచాలామంది అధికారపార్టీకి చెందిన నేతలు హాజరయ్యారు. వారిలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన కుమార్తె పవిత్రా రెడ్డి వచ్చారు. సీఎంతో ఫోటో తీసుకోవాలన్నది వారి ప్రయత్నం. అందుకు ఓకే చెప్పిన జగన్ ఫోటోకు ఫోజు ఇవ్వటానికి రెఢీ అయ్యారు. ఆ టైంలో సదరు నేత ముఖానికి మాస్కు పెట్టుకున్నారు. ఆయనతో అన్న మాటకు.. సదరు నేత నవ్వుతూ ముఖానికి మాస్కు తీసేసి ఫోటో దిగారు. మాస్కు పెట్టుకోని జగన్.. తన చుట్టూ ఉన్న వారిని మాస్కు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కంటికి కనిపించని కరోనాకు భయపడటమా? అన్నట్లు జగన్ తీరు ఉంటుంది.
తిరుమల పర్యటన అసాంతం సీఎం జగన్ మాస్కు పెట్టుకోలేదు. ఆయన ధైర్యానికి సాహసానికి చాలామంది వావ్ అనేస్తుంటారు. ఇక.. ఆయన అభిమానులు అయితే.. చెప్పాల్సిన అవసరమే లేదు. పరిస్థితి. ఇటీవల తన మామ అంతిమ సంస్కారాలకు హాజరైన జగన్.. అక్కడా మాస్కు పెట్టింది లేదు. అలా ముఖాన్ని కవర్ చేయని సీఎం జగన్.. నిన్న ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో మాత్రం.. పూర్తిస్థాయి మాస్కు పెట్టుకోవటం అందరిని ఆకర్షించింది. ఏ సందర్భంలోనూ మాస్కు పెట్టని జగన్ సారు.. మోడీ భేటీ సందర్భంగా మాస్కు పెట్టుకున్నారు. ఇదంతా చూసినప్పుడు సీఎం జగన్ చేత మాస్కు పెట్టించే సత్తా నమోకు మాత్రమే ఉందన్న భావన కలుగక మానదు.