Begin typing your search above and press return to search.
అమిత్ షాతో జగన్ భేటీలో ఎందుకంత హడావుడి అయ్యింది?
By: Tupaki Desk | 16 Dec 2020 10:39 AM ISTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన సాగుతోంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. రాత్రి వేళలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం అమిత్ షాతో భేటీ రాత్రి తొమ్మిది గంటలకు జరగాల్సి ఉంది. దీనికి తగ్గట్లే అపాయింట్ మెంట్ ను ఫిక్స్ చేశారు. దీంతో.. సాయంత్రం ఐదున్నర గంటలకు ఢిల్లీకి చేరుకున్న ఆయన.. జన్ పథ్ లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు.
ఊహించని విధంగా రాత్రి తొమ్మిది గంటలకు కాకుండా.. అరగంట ముందే అమిత్ షా నివాసానికి రావాలంటూ సీఎం జగన్ కు సమాచారం అందింది. దీంతో.. షా భేటీకి కాస్త ముందు హడావుడి నెలకొంది. షా భేటీకి ముందు.. జగన్ ఎలాంటి ప్రోగ్రాంలు పెట్టుకోకపోవటంతో ఇబ్బంది కలుగలేదు కానీ.. చివర్లో టైం మార్చటంతో హడావుడి నెలకొంది. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లిన జగన్.. సరిగ్గా ఎనిమిదిన్నర గంటలకుఅమిత్ షా ఇంటికి చేరుకున్నారు. వారి భేటీ 8.40 గంటలకు మొదలైంది.
దాదాపు గంటా ఐదు నిమిషాల పాటు (రాత్రి 8.40 గంటల నుంచి 9.45 గంటల వరకు) వివిధ అంశాల మీద ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిణామాలతో పాటు.. వివిధ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు (బుధవారం) ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ సాయంత్రంనాలుగు గంటల వేళలో ప్రధాని మోడీని కలిసే వీలుందని చెబుతున్నారు. ప్రధానితో భేటీ కావటానికి ముందు పలువురు కేంద్రమంత్రుల్ని సీఎం జగన్ కలవనున్నారు.