Begin typing your search above and press return to search.
9.48 లక్షల రైతులకు రూ.1,252 కోట్ల పరిహారం .. వైఎస్‌ఆర్ ఉచిత పంటల భీమా ప్రారంభం !
By: Tupaki Desk | 15 Dec 2020 1:57 PM ISTఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం అయింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. 2019 ఖరీఫ్ లో పంట నష్టపోయిన 9.48 లక్షల రైతుల ఖాతాల్లో ఈ పథకం ద్వారా రూ.1,252 కోట్లు జమ చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ పంటల బీమా పథకంతో పాలనా పరంగా మరో అడుగు ముందుకేశామని తెలిపారు. గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతు కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. కానీ బీమా సొమ్ము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితులను పూర్తిగా మార్చాం. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరుపున బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం అని తెలిపారు.
గతంలో 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే.. ఇప్పుడు 57 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదయ్యారు. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాలతో ఆర్ బీకేలను అనుసంధానం చేశాం. గ్రామంలోని ప్రతి ఎకరా ఈ-క్రాపింగ్ లో నమోదవుతోంది అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. భూమి సాగు చేస్తూ, ఈ క్రాప్‌లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ వివరాలు అంచనా వేసి, బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ–క్రాప్ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. 2019–20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన రూ.468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం రూ.971.23 కోట్లు చెల్లించింది.