Begin typing your search above and press return to search.

'జగనన్న సంపూర్ణ గృహహక్కు'పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 Dec 2021 6:14 PM IST
జగనన్న సంపూర్ణ గృహహక్కుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం విషయంలో లబ్ధిదారులు డబ్బులు కట్టాలన్న జగన్ సర్కార్ ఈ విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. చివరకు ప్రతిపక్షం టీడీపీ తాము కడుతామని ముందుకొచ్చింది. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో జగన్ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఓటీఎస్ పూర్తి స్వచ్ఛందం అని మరోసారి ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాల సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీఎస్ తో ప్రజలకు ఏరకంగా మంచి జరుగుతుందో చెప్పి.. వారికి అవగాహన కలిపించాలని అధికారులను ఆదేశించారు జగన్. రుణాలు మాఫీ చేసి రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయిస్తున్నామని చెప్పారు.

తమ సర్కార్ నిర్ణయంతో పేదలపై దాదాపు 10వేల కోట్ల రూపాయల భారీన్ని తొలగిస్తున్నట్టు తెలిపారు. వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనలను కూడా గత ప్రభుత్వం పరిశీలించలేదని జగన్ విమర్శించారు.

సుమారు 43వేల మంది టీడీపీ హయాంలో అసలు , వడ్డీ కూడా కట్టారని చెప్పారు. మరి ఇవాళ ఉచితంగా పట్టాలు ఇస్తామంటున్న వాళ్లు అప్పుడు ఎందుకు కట్టించుకున్నారని ప్రశ్నించారు.

ఓటీఎస్ ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణ హక్కులు ఇస్తున్నామని..అవసరాలకు తనఖా పెట్టుకోవడం.. అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.