Begin typing your search above and press return to search.

చంద్రబాబును చూడాలని ఉంది.. మనసులోని కోరికను బయటపెట్టిన జగన్

By:  Tupaki Desk   |   18 Nov 2021 6:13 PM IST
చంద్రబాబును చూడాలని ఉంది.. మనసులోని కోరికను బయటపెట్టిన జగన్
X
శాసన సభ, శాసనమండలి అనగానే.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే గుర్తుకువస్తుంది. అయితే అప్పడప్పుడు కొందరు సరదా సరదాగా జోకులు వేస్తూ సభలో నవ్వులు పూయిస్తుంటారు. ఇలాంటి సందర్భమే గురువారం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గురువారం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబును చూడాలని వుందంటూ సీఎం జనగ్ కోరడం.. సమావేశంలో అప్పటివరకూ ఉన్న వాతావరణం.. ఒక్కసారిగా చల్లబడింది.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గురువారం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో అధికార, ప్రతిపక్షం మధ్య ఆసక్తికర చర్చ సాగింది. సీఎం జగన్ ఓ చిన్న కోరికను అచ్చెన్నాయుడిని అడిగారు. జగన్ తన మనసులో మాటను బయటపెట్టడంతో అప్పటివరకు వాడివేడిగా సాగిన సమావేశం ఆయన మాటలతో తేలికపర్చారు. జగన్ కోరిక ఏమిటంటే.. ఆయనకు చంద్రబాబును చూడాలని అనిపించిందట. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ప్రస్తావనకు వచ్చింది. సభకు చంద్రబాబును తీసుకురాలని, కుప్పం ఫలితాల తర్వాత ఆయనను చూడాలని ఉందని, సభకు చంద్రబాబు వచ్చేలా చూడాలని అచ్చెన్నాయుడుతో జగన్‌ అన్నారు. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని సీఎం అన్నారు. జగన్ వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు స్పందిచారు. గెలుపోటములు సర్వసాధారణమని, చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని తెలిపారు. నెల్లూరులో అచ్చెన్న ఇన్‌చార్జ్‌గా ఉన్నారని మంత్రి అనిల్ చెప్పారు. దీంతో కాస్త అచ్చెన్న అసహానానికి గురయ్యారు. బీఏసీలో ఎన్నికల గురించి ఎందుకు? వైసీపీ ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసని అచ్చెన్న కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.

ఒక్క రోజు మాత్రమే సభను జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ తమ్మినేని తెలిపారు. అయితే చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని, 15 రోజులు జరపాలని అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. కొవిడ్ సమయంలో సభను ఆన్‌లైన్ ద్వారా నడపాలని, గతంలో టీడీపీనే ప్రస్తావించింది కదా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు.. అంగీకరించకుంటే ఎలా అంటూ ఈ నెల 26 వరకు సభ జరుపుదామని సీఎం ప్రకటించారు. సభలో అర్థవంతమైన చర్చలు జరిగేలా చూడాలని జగన్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని మంత్రులు గుర్తుచేశారు. దానికి పెద్ద హడావుడెందుకు.. లిమిటెడ్‌గా ఎమ్మెల్యేలు వెళ్తే సరిపోతుందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అడిగిన వెంటనే సీఎం అంగీకరించడం చారిత్రాత్మకమని బుగ్గన, జగన్ ను కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా.. జగన్ సీఎం అయ్యాక బీఏసీ సమావేశం ఇంత ప్రశాంతంగా సాగిందని వైసీపీ ఎమ్మెల్యే చెబుతున్నారు.