Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఇమేజ్ బిల్డింగ్ అదిరిందిగా!

By:  Tupaki Desk   |   4 May 2019 3:52 PM IST
జ‌గ‌న్ ఇమేజ్ బిల్డింగ్ అదిరిందిగా!
X
పోలింగ్ కు ముందు ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ త‌న ప్ర‌సంగాల్లో త‌ర‌చూ చంద్ర‌బాబు పాల‌న‌కు టైం ద‌గ్గ‌ర ప‌డింద‌న్న విష‌యాన్ని చెబుతుండేవారు. పోలింగ్ డేట్ ను ప్రాతిప‌దిక‌గా తీసుకొని.. తాను సీఎం కావ‌టానికి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పేవారు. లాజిక్ ఆలోచించే వారు జ‌గ‌న్ మాట‌ల్ని త‌ప్పు ప‌ట్టినా.. ఆయ‌న ప‌ట్టించుకోలేదు. పోలింగ్ కు రెండు రోజుల ముందు జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఇంకేముంది.. రెండు రోజులు.. మీ అన్న ముఖ్య‌మంత్రి కాబోతున్నార‌ని వ్యాఖ్యానించారు. అంత‌లా సీఎం ప‌ద‌వి గురించి మాట్లాడిన జ‌గ‌న్ ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారు?

పోలింగ్ జ‌రిగిన త‌ర్వాత నుంచి జ‌గ‌న్ చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. ఈవీఎంల వివాదం మీదా.. పోలింగ్ వేళ‌.. ఈవీఎంలు మొరాయించిన అంశాన్ని ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఆ విష‌యం మీద పెద్ద‌గా మాట్లాడింది లేదు. వీలైనంత మౌనంగా.. నిశ్శ‌బ్దంగా ఉన్న తీరు ఇప్పుడు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఎందుకిలా జ‌రుగుతోంది? జ‌గ‌న్ అలా ఉండ‌టానికి ఏదైనా ప్ర‌త్యేక కార‌ణం ఉందా? వ్యూహాత్మ‌కంగానే ఆయ‌న మౌనాన్ని పాటిస్తున్నారా? అన్న క్వ‌శ్చ‌న్లు ప‌లువురి నోటి నుంచి వ‌స్తున్నాయి. మ‌రి.. ఈ విష‌యంలో నిజం ఎంత‌న్న‌ది చూస్తే.. చాలానే ఉంద‌ని చెప్పాలి. అదెలానంటే..

ఎంత ఇష్ట‌మైన‌దైనా స‌రే.. అవ‌స‌రానికి మించి వ‌స్తుంటే.. దాని మీద ఇంట్ర‌స్ట్ త‌గ్గుతుంది. తిండి విష‌యంలోనూ ఇదే విష‌యాన్ని క్షీణోపాంత ప్ర‌యోజ‌న సూత్రం పేరుతో ఎక‌నామిక్స్ క్లాసులో చెబుతుంటారు. ఏపీ ముఖ్య‌మంత్రికి సంబంధించిన విష‌యంలోనూ ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారా? అంటే అవున‌ని చెప్పాలి. ఆ విష‌యాన్ని గుర్తించిన విప‌క్ష నేత జ‌గ‌న్ త‌న వ్యూహాన్ని మార్చుకున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

అవ‌స‌రానికి మించిన రియాక్ట్ కావ‌టంలో చంద్ర‌బాబు చాలా ముందుంటారు. ప్ర‌తి చిన్న విష‌యానికి అదే ప‌నిగా గంట‌ల త‌ర‌బ‌డి మీడియాతో మాట్లాడుతుంటారు. పొద్దున‌.. మ‌ధ్యాహ్నం.. సాయంత్రం.. కొన్నిసార్లు రాత్రిళ్లు కూడా మాట్లాడే చంద్ర‌బాబు.. చెప్పిన విష‌యాన్ని అదే ప‌నిగా చెప్పే ధోర‌ణి ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంది.

ఈ ధోర‌ణితో ప‌ని క‌న్నా మాట‌లు ఎక్కువ‌న్న మాట పెరిగిపోయింది. ఇక‌.. నోరు తెరిస్తే.. చెప్పాల్సిన విష‌యాన్ని సూటిగా చెప్ప‌టం మానేసి.. అదే ప‌నిగా రొద‌గా మాట్లాడం బాబులో ఈ మ‌ధ్య ఎక్కువైంది. వ‌య‌సు మీద ప‌డిన ప్ర‌భావ‌మో.. లేదంటే తాను ఎఫెక్టివ్ గా చెప్ప‌లేన‌న్న నిజాన్ని గుర్తించి.. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి వెళుతుంద‌ని భావిస్తున్నారో ఏమో కానీ.. బాబు మాట‌లు ఎక్కువ‌య్యాయి.

ఇదెలా మారిందంటే.. మాట్లాడే ముఖ్య‌మంత్రి మాకొద్దు.. కాస్త ప‌ని మీద దృష్టి పెట్టే సీఎం అయితే బాగుండ‌న్న‌ట్లుగా మారింది. ఇక‌.. జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. పోలింగ్ ముందు రాజ‌కీయంలో భాగంగా ఆయ‌న అదే ప‌నిగా మాట్లాడాల్సి వ‌చ్చింది. ఈ కార‌ణంతోనే ఆయ‌న మాట్లాడారు. జ‌గ‌న్ ను గ‌మ‌నిస్తే.. అవ‌స‌రానికి మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తారు కానీ అదే ప‌నిగా మాట్లాడ‌టం.. బాబు మాదిరి చెవుల్లో నుంచి ర‌క్తాలు కారేంత సుదీర్ఘంగా మీటింగ్ లు ఉండ‌వు.
బాబు పుణ్య‌మా అని రివ్యూ మీటింగ్ అంటేనే.. భ‌య‌ప‌డే ప‌రిస్థితి. ఇక‌.. పోలింగ్ పూర్తి అయిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చేసిన త‌ర్వాత ఏం మాట్లాడినా ఫ‌లితం ఉండ‌దు. అందుకే మౌనంగా ఉన్న ఆయ‌న‌.. త‌న విజ‌య అవ‌కాశాల్ని స‌మీక్షించుకున్న త‌ర్వాత నుంచి ఆయ‌న మ‌రింత నిశ్శ‌బ‌ద్దంగా ఉంటున్నారు.

త‌మ పార్టీ అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌న్న విష‌యాన్ని గుర్తించిన జ‌గ‌న్‌.. తాను మాట‌ల మ‌నిషిని కాదు.. చేత‌ల మ‌నిషిని అన్న విష‌యాన్ని తెలిపేలా త‌న తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఫ‌ణి తుఫాను కార‌ణంగా అత‌లాకుత‌లం అవుతుంద‌న్న అంచ‌నాలున్న ఉత్త‌రాంధ్ర విష‌యం మీద జ‌గ‌న్ మాట్లాడ‌లేదు కానీ.. అధికారులు ఎలా ప‌ని చేస్తున్నారు.. ఏయే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌న్న విష‌యాన్ని విజ‌య‌సాయి ట్వీట్ల రూపంలో చెబుతూనే ఉన్నారు. ప్ర‌తి విష‌యానికి మాట్లాడే క‌న్నా.. వ్య‌వ‌స్థ‌లు త‌మ ప‌ని ద్వారా మాట్లాడాల‌న్న భావ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే ఆయ‌న మౌనంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అదేప‌నిగా మాట్లాడే బాబు మాదిరి తాను మాట్లాడితే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు స‌రిక‌దా.. మాట‌ల‌తో ఏపీ ప్ర‌జ‌లు మొహ‌మెత్తి ఉన్నార‌న్నది గుర్తించిన జ‌గ‌న్‌.. సైలెంట్ గా త‌న ప‌ని తాను చేసుకుంటున్నార‌న్న మాట వినిపిస్తోంది. ఫ‌లితాలు వెల్ల‌డి కాకుండా.. చేతికి అధికారం రాకుండానే ఓవ‌రాక్ష‌న్ చేసిన భావ‌న ప్ర‌జ‌ల్లో క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ప‌ద‌వీ కాలం పూర్తి అయ్యాక కూడా బాబు చేస్తున్న చేష్ట‌లు ప‌లువురిలో చిరాకు తెస్తున్న నేప‌థ్యంలో.. ఆ బాట‌లో తాను న‌డ‌వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లోనే జ‌గ‌న్ జాగ్ర‌త్త‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ ఇమేజ్ బిల్డింగ్ డిజైన్ చేస్తున్న వ్యూహ‌క‌ర్త‌లు సైతం ఆయ‌న ఆలోచ‌న స‌రైన‌ద‌న్న మాట చెప్పిన‌ట్లుగా స‌మాచారం. అందుకే.. జ‌గ‌న్ మౌనంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.