Begin typing your search above and press return to search.

జగన్ కి వేయి... వారికి ఎనిమిది వందలు...?

By:  Tupaki Desk   |   26 Feb 2022 7:00 AM IST
జగన్ కి వేయి... వారికి ఎనిమిది వందలు...?
X
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వేయి రోజులు పూర్తి అయ్యాయి. దీని మీద సహస్త్ర కాంతులు అని ఆ పార్టీ గొప్పగా చెప్పుకుంది. అదే టై, లో అమరావతి రాజధాని రైతుల ఆందోళనకు కూడా ఎనిమిది వందల రోజులు పూర్తి అయ్యాయి.

అది వెలుగు అయితే ఇది మరక అని విపక్షాలు ఎద్దేవా చేస్తున్న సంగతి కూడా ఉంది. జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానుల ముచ్చట మొదలైంది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా చేయాలన్నది వైసీపీ ఆలోచన.

అయితే తమతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఇలా ఉల్లఘించడం అన్నది మంచిది కాదు అని అమరావతి రైతులు ఆందోళన మొదలెట్టారు. అది ఏకంగా ఎనిమిది వందల రోజుల మైలు రాయిని దాటింది. తాము అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని తమ భూములను మొత్తం ఇచ్చామని వారు అంటున్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావాతి మాత్రమే ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

అయితే దీని మీద వైసీపీ ఏమీ మాట్లాడడంలేదు. వచ్చే బడ్జెట్ సమావేశాలో మూడు రాజధానుల బిల్లుని కూడా ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఇక అమరావతి రాజధాని రైతుల ఆందోళనను పూర్తిగా వైసీపీ పట్టించుకోవడంలేదు.

దీని మీద తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ కూడా అలా ఉన్నాయి. అమరావతి రైతులు చేసేది ఉద్యమం కాదు. అది ఒక రాజకీయ ఉద్యమం అని ఆయన అంటున్నారు.

ఆమరావతి రాజధాని కొరకు టీడీపీ చేసే ఉద్యమమని ఆయన ఆరోపించారు. టీడీపీకి సమిష్టిమైన ఆలోచన ఏదీ లేదని ఆయన దుయ్యబెడుతున్నారు. గతంలోనూ వైసీపీ మంత్రులు ఇదే రకంగా మాట్లాడారు, అమరావతి ఉద్యమం ప్రస్థావన ఎపుడు వచ్చినా వారు ఇలాగే గట్టిగా రియాక్ట్ అవుతున్నారు.

ఈ నేపధ్యంలో అమరావతి రైతుల ఆందోళన ఎనిమిది వందల రోజులు అని రాసుకోవడం వరకేనా లేక దీని వల్ల ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా అంటే మొదటికే రైట్ అన్నదే మెజారిటీ వర్గాల భావన.

మొత్తానికి వేయి రోజుల పాలనలో మొదటి రెండు వందల రోజులు మాత్రమే ఎలాంటి ఆందోళనలు, వివాదాలు లేకుండా జగన్ ఏలుబడి సాగిందేమో అని అంటున్నారు. ఒక వైపు అమరావతి ఉద్యమం అలా సాగడం మాత్రం జగన్ సర్కార్ కి ఇబ్బందికరమైన పరిణామమే అంటున్నారు.

ఇక మరో ఎనిమిది వందల రోజుల పాలన మాత్రమే జగన్ చేతిలో ఉన్న వేళ అమరావతి ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టేలా శాశ్వత పరిష్కారం ఏదైనా తీసుకుంటారా లేక దాని ఉద్యమాల రోజుల నంబర్ కూడా ఈ పాలనతో పాటు పెరుగుతుందా అన్నదే చూడాలి.