Begin typing your search above and press return to search.

జగన్ మరో సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   19 Jun 2019 1:11 PM IST
జగన్ మరో సంచలన నిర్ణయం
X
రాయలసీమలోని కర్నూలు జిల్లా వైసీపీని 2014 నుంచి ఆదరిస్తోంది. ఆ ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇక ఈ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అందుకే తమను ఇంత ఆదరించిన ఆ జిల్లా ప్రజలకు రెండు మంత్రి పదవులు ఇచ్చాడు జగన్.

డోన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గనకు కీలకమైన ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖను. ఆలూరు ఎమ్మెల్యే జయరాంకు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి పదవి ఇచ్చాడు. ఇప్పుడు అదే జిల్లాకు మరో కీలకమైన పదవి ఇచ్చాడు.

మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ గడిచిన ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గురై ఆ పార్టీలో చేరి మంత్రి పదవి అనుభవించారు. అయితే అఖిల ప్రియ రాకతో అప్పటివరకు వారి ప్రత్యర్థులుగా టీడీపీలో ఉన్న గంగుల కుటుంబం వైసీపీలో చేరింది. ఈ ఎన్నికల్లో గంగుల బిజేంద్ర రెడ్డి అఖిలప్రియను చిత్తుగా ఓడించారు.

తాజాగా జగన్ శాసన మండలి ప్రభుత్వ విప్ పదవిని గంగుల ఫ్యామిలీకి ఇచ్చారు. ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డికి శాసనమండలి విప్ పదవిని కేటాయించారు. ఈయన వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కేబినెట్ హోదా, ప్రొటోకాల్ ఉన్న ఈ పదవిని కేటాయించడంతో గంగుల ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక భూమా అఖిల ప్రియకు ఇది గట్టి షాక్ గానే చెప్పవచ్చు.