Begin typing your search above and press return to search.

ఆంధ్రజ్యోతి ఆర్కేకు షాకిచ్చిన జగన్.!?

By:  Tupaki Desk   |   1 July 2019 11:11 AM IST
ఆంధ్రజ్యోతి ఆర్కేకు షాకిచ్చిన జగన్.!?
X
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన తెరవెనుక శక్తి. చంద్రబాబు సాయంతో బాగా లాభపడ్డారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు బాబు ఓడిపోవడం.. వైఎస్ జగన్ గద్దెనెక్కడంతో టీడీపీ అనుకూల మీడియా జీర్ణించుకోవడం లేదట.. పైగా జగన్ అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండడంతో వీరు సహించలేకపోతున్నారట..

అమరావతిలోని ప్రజావేదిక కూల్చివేతను నానాయాగీ చేద్దామని భావించిన ఎల్లో మీడియా అది అక్రమ కట్టడం కావడంతో నోట్లో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా తేలుకుట్టిన దొంగలవలే గమ్మును ఊరుకున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.. అయితే ఇప్పుడు విశాఖలోనూ అక్రమ నిర్మాణాలపై జగన్ కూల్చివేతకు రంగం సిద్ధం చేయడం టీడీపీని, దాని అనుకూల మీడియాను కలవరపాటుకు గురిచేస్తోందని సమాచారం.

ఇక చంద్రబాబు హయాంలో ఆయాచిత వరాలు పొంది తన మీడియాను విస్తరించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ అనుకూల మీడియా అధినేతకు ఇప్పుడు సీఎం జగన్ తనదైన శైలిలో షాకిచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఆంధ్రజ్యోతి పత్రిక నూతన కార్యాలయాన్ని ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టారని.. ఆ పత్రికకు కూడా అధికారులు నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని ప్రచారం జరుగుతోంది.. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేతకు లేదా ఫైన్ గా 70 లక్షలు కట్టాలని అధికారులు నోటీసులు ఇచ్చారని.. ఇది ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు షాకింగ్ గా మారిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అక్రమంగా నిర్మించిన అన్ని భవనాలకు నోటీసులు ఇస్తున్న క్రమంలోనే అధికారులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పత్రికాఫీసుకు నోటీసు ఇవ్వడంలో వింతే లేదని అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆయన తోడ్పాటుతో నిర్మించిన అక్రమ భవనం కాబట్టే దీనికి నోటీసు ఇచ్చామని కాకినాడ అధికారులు చెబుతున్నారు. అయితే ఏదీ ఎలా ఉన్నా జగన్ పై దుమ్మెత్తి పోసిన ఆర్కేకు ఇప్పుడు ఆయన టీడీపీ అధినేత అండ చూసుకొని చేసిన తప్పులే శాపంగా మారాయని వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి.