Begin typing your search above and press return to search.
పండగ పూట అయినా బాబుకు షాకివ్వటం ఆపరా?
By: Tupaki Desk | 22 Aug 2020 2:00 PM ISTషాకుల మీద షాకులు తగులుతున్నాయి ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు. జగన్ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి తరచూ ఏదో విషయంలో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతూనే ఉంది. బాబు అంచనాలకు భిన్నంగా వేస్తున్న ఎత్తులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐదేళ్ల పాలనలో తన చుట్టూ ఉండే వారి విషయంలో బాబు చేసిన తప్పులు ఇప్పుడు ఆయనకు శాపంగా మారుతున్నాయి.
బాబులో స్పీడ్ తగ్గటం.. కనుచూపు మేరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టేంత శక్తివంతమైన పార్టీ కానీ నేత కానీ లేకపోవటంతో..జగన్ ఫ్యాన్ కింద సేద తీరాలన్న ఆలోచన నేతలకు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో టీడీపీ నేత.. బాబుకు గుడ్ బై చెప్పేసి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
పండుగ వేళ.. రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్.. టీడీపీ కండువా పక్కన పెట్టేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ కండువాను భుజాన వేసేసకున్నారు. ఈ సందర్భంగాఆయన్ను.. ఆయన అనుచర వర్గాన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్. విడి రోజుల్లో ఎటూ చంద్రబాబుకు ఏదో విధంగా షాకులు తప్పట్లేదు. పండుగ వేళలోనూ.. ఇలా పార్టీలోకి ఆహ్వానిస్తూ.. కండవాలు కప్పేస్తే.. బాబుకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించావా జగన్? ఇలా చేస్తే.. ఏడాదికి వచ్చే పండగ కూడా చేసుకోలేని పరిస్థితి ఉందన్న విషయాన్ని యువనేత గుర్తిస్తే మంచిదేమో?