Begin typing your search above and press return to search.

నర్సాపురం ఎంపీ కి క్లాస్ పీకిన సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:17 AM GMT
నర్సాపురం ఎంపీ కి క్లాస్ పీకిన సీఎం జగన్ !
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగం దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు భాష కోసం నిధులు తెచ్చుకుని, ఇంగ్లీష్ మీడియం కోసం వినియోగిస్తారా? అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో రఘురామ కృష్ణంరాజు పై సీఎం జగన్ సీరియస్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌ సభలో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి తో కలసి రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్‌ ను కలిశారు.

ఈ సమావేశంలో మూడు విషయాలపై సీఎం జగన్ ఆయన కు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. భుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడడం, విజయసాయిరెడ్డికి తెలియకుండా ప్రధాని మోదీ, ఇతర నేతలను కలవడం వంటి విషయాలపై ఆయన కొంచెం గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి ఎంపీ సీఎం తో మాట్లాడుతూ ... నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడ లేదు అని , తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీఎం కి వివరించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమం లో కృష్ణంరాజు పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన బీజేపీలో చేరుతారంటూ అనేక ప్రచారాలు చేస్తున్నారు. దీంతో పాటు వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ ఇంటికి వచ్చి కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకి దారి తీసింది. దీనిపై ఎంపీ కృష్ణం రాజు మాట్లాడుతూ .. ఏవైనా నియోజకవర్గ నిధుల విషయం లో మంత్రులను కలుస్తారే తప్ప.. రాజకీయంగా ఎవరూ టచ్‌లో లేరని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఎంపీ కూడా పార్టీ గీత దాటి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పారు.