Begin typing your search above and press return to search.

ప్రభుత్వాసుపత్రులు రూపురేఖ‌లు మారుస్తానన్న సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   18 Feb 2020 2:30 PM GMT
ప్రభుత్వాసుపత్రులు రూపురేఖ‌లు మారుస్తానన్న సీఎం జగన్ !
X
కర్నూలులో మూడో దశ 'వైఎస్‌ఆర్‌ కంటివెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ..కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని , గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.

ఈ క్రమంలోనే అయన మాట్లాడుతూ ...అవ్వాతాత‌ల‌కు ఎంత చేసినా త‌క్కువే అని చెప్పే వ్య‌క్తుల్లో మొట్ట‌మొద‌టి వ్య‌క్తిని తానేనని జగన్ అన్నారు. మార్చి 1 నుంచి అవ్వాతాతలకు అవసరమైతే , గ్రామ సచివాలయాల్లోనే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికోసం 133 కేంద్రాల్లో కంటి శస్త్ర చికిత్సకై ఏర్పాట్లు చేశామన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అవ్వాతాతలకు కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.

అలాగే రూ. 15,337 కోట్లతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని , ‘‘మొదటి దశలో రూ. 1129 కోట్లతో నాడు-నేడు. రెండో దశలో పీహెచ్‌సీ, కమ్యూనిటీ సెంటర్లలో నాడు-నేడు. రూ. 700 కోట్లతో ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ. రాష్ట్రంలో కేవలం 11 బోధనాసుపత్రులు మాత్రమే ఉన్నాయి. మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులు తీసుకువస్తాం. ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.