Begin typing your search above and press return to search.
ప్రణబ్ ను ‘అంకుల్’ అని పిలిచే చనువు జగన్ కు ఎక్కడిది?
By: Tupaki Desk | 1 Sept 2020 10:15 AM ISTరాజకీయాల్లో పరిచయాలు వేరు. దగ్గరితనం వేరు. చాలామంది తెలియొచ్చు. కానీ.. వారికి సన్నిహితంగా వెళ్లటం అంత తేలికైన విషయం కాదు. అందునా ప్రణబ్ దా లాంటి ఆగ్రనేతకు దగ్గర కావటం అంత తేలికైన విషయం కాదు. ఆయన్ను ‘అంకుల్’ అని పిలిచే దగ్గరతనం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంతం. ఆయనకు అంతలా ఎలా దగ్గరయ్యారు? జగన్ అంటే ప్రణబ్ కు అంత అభిమానం ఎందుకు? అన్న విషయాలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.
జగన్ తండ్రి దివంతగ మహానేత వైఎస్ కు ప్రణబ్ దాకు మధ్య అనుబంధం ఎక్కువ. కాంగ్రెస్ లో రెబల్ గా వ్యవహరించినా.. ఆయనపై అధినాయకత్వం చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నది ప్రణబ్ దానేనని చెబుతారు. ప్రజాభిమానం పుష్కలంగా ఉండటంతో పాటు.. వైఎస్ వ్యక్తిగతంగా తెలిసి ఉండటం.. పార్టీ విషయంలో ఆయన కమిట్ మెంట్ ను పూర్తిగా అర్థం చేసుకున్న ప్రణబ్ ఆయన్ను బాగా ఇష్టపడేవారు.
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పాలనపై మిగిలిన వారు అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసినా.. వాటిని వివరంగా చెప్పటంలో ప్రణబ్ కీలకమని చెబుతారు. ప్రణబ్ కు సన్నిహితుడైన వైఎస్.. తన కొడుకు జగన్ ను ఎంపీగా చేసినప్పుడు.. ఢిల్లీలో సలహాలు.. సూచనల్ని ప్రణబ్ ను సంప్రదించమని చెప్పేవారిన చెబుతారు. తన కొడుకు విషయంలో బాధ్యత తీసుకోవాలని ప్రణబ్ దాను వైఎస్ కోరినట్లుగా వినికిడి. యువకుడైన జగన్ చురుగ్గా ఉండటం ప్రణబ్ ను ఇంప్రెస్ చేసిందని చెబుతారు.
ఈ కారణంతోనే.. జగన్ కు ఏదైనా సందేశాన్ని పార్టీ తరఫున ఇవ్వాల్సి వస్తే.. ప్రణబ్ కే పురమాయించేవారని చెబుతారు. చివరకు ఓదార్పు యాత్రను వద్దన్న విషయాన్ని ఆయన ద్వారానే చెప్పటం దీనికి నిదర్శనంగా చెబుతారు. ప్రణబ్ ను అంకుల్ అని పిలిచే చనువు జగన్ సొంతం. దీనికి తగ్గట్లే.. రాష్ట్రపతిగా బరిలో నిలిచిన వేళ.. తాను వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ.. తమ పార్టీ మద్దతు ప్రణబ్ కు ఇస్తానని జగన్ తేల్చి చెప్పటాన్ని మర్చిపోలేం. వైఎస్ కుటుంబానికి పెద్దగా నిలిచిన ప్రణబ్ మాటలకు జగన్ ఎంతో విలువనిస్తారని చెబుతారు.
ఈ వాదన ఎంత నిజమన్నది ఎన్నికల్లో జగన్ విజయం సాధించిన తర్వాత ప్రణబ్ చేసిన ట్వీటే నిదర్శనం. మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎవరూ జగన్ ను అభినందించేందుకు సాహసం చేయకుండా ఉంటే.. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ప్రణబ్ మాత్రం బాహాటంగా తన ఆనందాన్ని ట్వీట్ తో పంచుకున్నారని చెప్పాలి. ‘‘తిరుగులేని విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. యువకుడివైన నీపై ఆంధ్రా ప్రజలు విశ్వాసం ఉంచారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నీదే. మీ నాన్న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు గర్వపడతారు’’ అని పేర్కొనటం చూస్తే.. వైఎస్ కుటుంబంపై ప్రణబ్ దా అభిమానం ఇట్టే అర్థం కాక మానదు.