Begin typing your search above and press return to search.

గంటా-అరగంటా-పావు గంటా.. వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌..!

By:  Tupaki Desk   |   5 Jan 2022 7:04 PM IST
గంటా-అరగంటా-పావు గంటా.. వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌..!
X
అదేంటి.. ? ఈ త‌ర‌హా చ‌ర్చ జ‌ర‌గ‌డం ఏంటి? అని అనుకుంటున్నారా ? ఇది నిజ‌మే! గంటా-అరగంటా-పావుగంటా! అని వైసీపీ నేత‌లు ఒక‌రికొక‌రు ఫోన్లు చేసుకుని మ‌రీ చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎంపీల‌ఫోన్ల‌కు నిరంత‌రాయంగా ఫోన్లు వ‌స్తూనే ఉన్నాయి. మంత్రుల నుంచి ముఖ్య నేత‌ల వ‌ర‌కు .. కూడా ఇదే విష‌యంపై సీనియ‌ర్ల‌కు ఫోన్లు చేస్తున్నారు. ``సార్‌.. ఏంటింది? గంటా.. అర‌గంటా.. ఎంత వ‌ర‌కు జ‌రిగింది సార్‌.. మేం స‌మాధానం చెప్ప‌లేక పోతున్నాం.. మీడియా వాళ్లు మాకు ఫోన్లు చేస్తున్నారు..`` అంటూ.. స‌తాయిస్తున్నార‌ట‌.

దీంతో సీనియ‌ర్లు కూడా.. త‌మ‌కు కూడా ఈ విష‌యంలో క్లారిటీ లేద‌ని.. పార్టీ కీల‌క నేత‌ల నుంచి `గంట‌` అని స‌మాధానం వ చ్చింద‌ని చెబుతున్నార‌ట‌. ఇంత‌కీ విష‌యంలో కి వెళ్తే.. సీఎం జ‌గ‌న్‌.. ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ టూర్‌లో ఢిల్లీలోని కేంద్ర పెద్ద‌ల‌ను ఆయ‌న భేటీ కానున్న విష‌యం తెల‌సిందే. ఈ క్ర‌మంలో తొలుత ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అయితే.. ఈ స‌మావేశంలో ఏం చ‌ర్చించారు? ఏపీకి ఏం తెస్తున్నారు? అనే చ‌ర్చ‌క‌న్నా..కూడా.. జ‌గ‌న్ ప్ర‌ధానితో ఎంత సేపు భేటీఅయ్యారు..? అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

అయితే.. అధికార ప‌క్షం నుంచి అధికారులు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌ధాని మోడీతో గంట సేపు భేటీ అయ్యార ని.. ప్ర‌క‌టించారు. దీనినే కొన్ని మీడియా ఛానెల్లు ప్ర‌సారం చేశాయి. అయితే.. ఇంత‌లోనే.. ప్లేట్ తిర‌గ‌బ‌డింది. మ‌రికొన్ని మీడి యా చానెళ్లు గంట‌కాదు.. కేవ‌లం అర‌గంటే.. సీఎంకు ప్ర‌ధాని స‌మ‌యం ఇచ్చార‌ని.. అందులోనూ.. కేవ‌లం 20 నిముషాలు మాత్ర మే మాట్లాడార‌ని.. పేర్కొన్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ..ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కేవ‌లం ప‌ది నిముషాలు మాత్ర‌మే ప్ర‌ధాని మోడీతో బేటీ అయ్యార‌ని.. అందులోనూ.. ప్ర‌త్యేక‌త ఏమీలేద‌ని.. వ్యాఖ్యానించారు.

దీంతో కొన్ని మీడియా చానెళ్లు ప్ర‌తినిధులు.. వైసీపీకి చెందిన కీల‌క నేత‌ల‌కు ఫోన్లు చేసి.. స‌ర్‌.. సీఎం సార్‌..ఎంత సేపు.. పీఎంతో మాట్లాడారు..? గంటా.. అర‌గంటా.. పావుగంటా? అని ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి స‌మాధానం చెప్ప‌లేక‌.. ఇదే ప్ర‌శ్న‌ను సీనియ‌ర్ల‌కు, ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్ద‌ల‌కు ఫోన్లుచేస్తున్నార‌ట‌. అయితే.. ఈ విష‌యంలో ఒక్క‌టే మాట‌ని.. గంట సేపు పీఎంతో సీఎం భేటీ అయ్యార‌ని వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ నేత‌లు ఏం చెప్పాలో తెలియ‌క‌.. తిక‌మ‌క ప‌డుతున్నార‌ట‌. చిత్రం ఏంటంటే.. సీఎం టూర్‌లో ఆయ‌న ఏం మాట్లాడారో.. చ‌ర్చించ‌కుండా..కేవ‌లం స‌మ‌యం లెక్కేసుకోవ‌డం.. ఆస‌క్తిగా మారింది.