Begin typing your search above and press return to search.

అయ్యో జగన్! ఆ రోజులు పోయాయని మర్చిపోయావా?

By:  Tupaki Desk   |   16 Nov 2017 3:35 AM GMT
అయ్యో జగన్! ఆ రోజులు పోయాయని మర్చిపోయావా?
X
ఒకప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగి భారీ ప్రాణ నష్టం జరిగితే ఆయా శాఖలు చూసే మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసేవారు. రాష్ర్టాల్లో అయినా కేంద్రంలో అయినా ఇలా రాజీనామా చేసినవారు చాలామందే ఉన్నారు. మహామహులైన నేతలే ఇలా నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసిన సందర్భాలున్నాయి. కానీ.. తరువాత కాలంలో ఆయా మంత్రులు రాజీనామా చేసినా వాటిని ఆమోదించేవారు కాదు. దాంతో అదో ప్రహసనంగా మాత్రమే మిగిలిపోయేది. ఆ తరువాత కాలంలో.. అంటే ప్రస్తుత కాలంలో అసలు నైతిక బాధ్యత అన్న ఆలోచనే మంత్రులకు ఉండడం లేదు, దాంతో రాజీనామా చేయమని ప్రతిపక్షాలు డిమాండు చేసినా కూడా వారు స్పందించడం లేదు. అయితే... ఏపీలో విపక్ష నేత జగన్ మాత్రం అదంతా మర్చిపోయినట్లున్నారు. రీసెంటుగా జరిగిన బోటు ప్రమాదానికి బాధ్యత వహించి టూరిజం మంత్రి - సీఎం ఇద్దరూ రాజీనామా చేయాలని ఆయన డిమాండు

అయితే... వైసీపీ నేతలే జగన్ డిమాండు తప్పంటున్నారట. అందుకు కారణమూ వారే చెబుతున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో సీఎం కోసం జనాన్ని ఆపితే, అది తొక్కిసలాటకుదారితీయడం ఇంతకంటే ఎక్కువ మంది సీఎం కళ్లెదుటే మరణించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అంతజరిగితేనే పట్టించుకోనప్పడు, తమది బాధ్యత కాదని తేల్చేసినప్పుడు ఇప్పుడీ బోటు ప్రమాదం గురించి వారేం పట్టించుకుంటారని

జగన్ తన పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ వచ్చినప్పుడు అది టూరిజం మంత్రి నియోజకవర్గం కావడంతో వైసీపీ అధినేత జగన్ ఈ డిమాండు చేశారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి చెందిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. ఆ ఘటనపై వేసిన కమిషన్ ఏమైందని ప్రశ్నించారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం తమ నాయకుడు రాజకీయాల్లో నీతి, న్యాయాలను కోరుకుంటున్నారని.. కానీ, పాలక పక్షంలో అది లోపించిందని... వారి నుంచి బాధ్యతను ఆశించడం దండగని అంటున్నారు.