Begin typing your search above and press return to search.

ఏపీ చాంబర్స్ లో మూడో కన్ను.?

By:  Tupaki Desk   |   4 July 2019 11:00 PM IST
ఏపీ చాంబర్స్ లో మూడో కన్ను.?
X
జగన్ తన పాలనను పారదర్శకంగా.. అవినీతి రహితంగా చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసినట్టు ఏపీ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ పాలన కేంద్రమైన సెక్రెటేరియట్ లో అవినీతి జరగకుండా ఉండడానికి జగన్ సీక్రెట్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేసినట్టు సమాచారం. వీరు ఏపీలోని ప్రతి శాఖ, చాంబర్ దగ్గర బట్టన్ కెమెరాలతో తిరుగుతోందట..

జగన్ పెట్టిన ఈ నిఘా ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఏపీ సెక్రెటేరియట్ లోని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో పార్టీ హైకమాండ్ కు, జగన్ కు ఇన్ఫర్మేషన్ ను పంపిస్తున్నారట..

పార్టీలో, ప్రభుత్వంలో ఏమైనా సీక్రెట్ డీల్స్ జరుగుతున్నాయా? అవకతవకలు జరుగుతున్నాయనే విషయాలను ఇంటెలిజెన్స్ కి ఇస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.

జగన్ అవినీతి రహిత పాలన అందించేందుకు ఈ సీక్రెట్ నిఘా వ్యవస్థను సెక్రెటేరియట్ సహా కీలక ప్రాంతాల్లో మోహరించినట్టు సమాచారం. వీరు అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో జగన్ కు చేరవేస్తున్నారట.. సో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఇక అవినీతికి పాల్పడితే జగన్ వేసిన మూడోకన్నుకు బలికాక తప్పదు.