Begin typing your search above and press return to search.

జగన్ హైదరాబాద్ కు.. ప్రత్యేక పోరు ఇంటికి

By:  Tupaki Desk   |   14 Oct 2015 11:10 PM IST
జగన్ హైదరాబాద్ కు.. ప్రత్యేక పోరు ఇంటికి
X
ప్రత్యేక హోదా పోరాటం జగన్ కు, వైసీపీకి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది.. జగన్ ప్రారంభించిన ఈ పోరాటం ఇప్పుడు దారీతెన్నూ లేకుండా సాగుతోంది. ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించాలా అన్నది అర్థం కాక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. సరైన ప్లానింగు లేకుండా ఒక్క ఉదుటన ఆమరణ దీక్ష అంటూ దిగడంతో అంతా తలకిందులైందని ఆ పార్టీ సీనియర్లు గుసగుసలాడుతున్నారు. పోరాటాన్నీ మళ్లీ పట్టాలెక్కించాలా.. లేదంటే ముగించాలా అని ఆలోచిస్తున్నారు. నిజానికి జగన్ పోరాటాన్ని ఉద్ధృతం చేసి చివర్లో దీక్ష చేస్తే బాగుండేది. కానీ, అలా చేయలేదు. రెండు యునివర్సిటీస్ లో సభలు ఏర్పాటు చేసి అంతా తన వెనుకే ఉన్నారన్న ఫీలింగుతో రంగంలోకి దిగారు జగన్. కానీ, చంద్రబాబు ప్రభుత్వం దీన్ని లైట్ గా తీసుకుంది. అంతలోనే సడెన్ గా దీక్షను భగ్నం చేసింది. దాంతో జగన్ హాస్పిటల్ కు.. అక్కడినుంచి హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఏం చేస్తారు ఎలా చేస్తారన్నది మాత్రం వారికీ క్లారిటీ లేదు.

మరోవైపు అమరావతి శంకుస్థాపన పనులతో గవర్నమెంటు బిజీగా ఉంది... మోడీ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ దశలో రాజకీయాలను జాగ్రత్తగా గమనించి అడుగేయాల్సి ఉంది. వైసీపీ నేతలు కానీ, జగన్ కానీ రాజకీయ పరిణామాలను సరిగ్గా అంచనా వేయకుండా మళ్లీ కార్యాచరణ ప్రకటిస్తే మరోసారి అభాసుపాలు కాక తప్పదు. దీక్ష భగ్నం కావడంతో ప్రస్తుతం గ్యాప్ వచ్చిన ఈ పోరాటాన్ని వైసీపీ ఎలా కంటిన్యూ చేస్తుందన్నదే ప్రశ్న.