Begin typing your search above and press return to search.
జేబులపై కన్నేసిన యూట్యూబ్!
By: Tupaki Desk | 4 Sep 2015 10:32 AM GMTవ్యాపారం వ్యాపారమే. కాసులు కురిపించే ఏ చిన్న అవకాశాన్ని ఏ వ్యాపారి మాత్రం వదులుకుంటాడు. మొదట అలవాటు చేసేందుకు తనకున్నంత విశాల హృదయం మరెవరికీ లేనట్లుగా వ్యవహరిస్తూనే.. సరిగ్గా.. సమయంలో చూసి ముక్కుపిండి వసూలు చేయటం మామూలే. తాజాగా అలాంటి పనికే తెర తీస్తోంది యూట్యూబ్.
ఇవాళ.. రేపటి రోజున వీడియోలు చూడాలంటే మరో ఆలోచన లేకుండా యూట్యూబ్ మీద ఆధారపడేవారెందరో. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో యూట్యూబ్‌ల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. దీన్ని గుర్తించి.. వీడియోలు చేసే వారు తప్పదన్నట్లుగా యాడ్ లు పోస్ట్ చేసి వ్యాపారం చేసుకుంటున్న యూట్యూబ్ తాజాగా మరో ప్లాన్ వేసింది.
తానను యాడ్స్ తో చూపిస్తున్న వీడియోల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి కోసం యాడ్ ఫ్రీ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేయనుంది. ఇందులో ఎలాంటి ప్రకటనలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. హమ్మయ్య అని అనుకునేలోపే.. అసలు విషయాన్ని చెప్పేస్తుంది. యాడ్స్ లాంటివేమీ లేకుండా వీడియోలు చూడాలనుకునే వారు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అంటే.. వీడియోలు ఇప్పటివరకూ ఉచితంగా చూసే దానికి భిన్నంగా.. డబ్బులు చెల్లించి యాడ్ ఫ్రీ వీడియోల్ని చూడాలన్నమాట. ప్రకటనలతో కూడిన వీడియోలు చికాకు పుట్టిస్తే.. యాడ్ లేని వీడియోలు జేబుకు చిల్లు పడటం ఖాయమన్నమాట. మొత్తానికి యూట్యూబ్‌లో వీడియో చూడాలంటే అయితే.. యాడ్ తో అయినా చూడాలి లేదంటే.. డబ్బులు చెల్లించి యాడ్ లేకుండా అయినా చూడొచ్చు. తాజా ఐడియాను త్వరలో అమలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.ఈ విధానం అమలు చేస్తే మాత్రం యూట్యూబ్‌కు కాసులు కురవటం ఖాయమన్న మాట.