Begin typing your search above and press return to search.

యువత రాజకీయాల్లోకి రావాలి: ప్రధాని మోదీ

By:  Tupaki Desk   |   12 Jan 2021 4:19 PM IST
యువత రాజకీయాల్లోకి రావాలి: ప్రధాని మోదీ
X
భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా..పాలకుడిగా... ప్రపంచంలో మేటి రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్టోబరు 7, 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అలా వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడుతూ కమల దళాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 2014, 2019లో ప్రధానిగా వరుసగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అలా 2001 నుంచి ఇప్పటి వరకు ఇటు వ్యక్తిగతంగా.. అటు ప్రభుత్వ పరంగా.. ఓటమనేదే ఎరుగరు నరేంద్ర మోదీ.

2001లో గుజరాత్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అవి విజయవంతం కావడంతో గుజరాత్ రూపు రేఖలే మారిపోయాయి. మొట్ట మొదటగా ఆయన విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. విద్యుత్ సంస్కరణలంటే ఏ ప్రభుత్వమైనా రాజకీయలను దృష్టిలో ఉంచుకొని వెనకడుగు వేస్తుంది. కానీ మోదీ అలాకాదు.. రైతులు..ప్రజల్లో విశ్వాసం చూరగొనేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2003లో రాష్ట్ర స్థాయిలో పెట్టుబడుల సదస్సును నిర్వహించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారీగా పెట్టుబడులు రావడంతో గుజరాత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. పరిశ్రమలు, వ్యవసాయం, ఇన్‌ఫ్రా రంగాలు పురోగతిలో పయనించాయి. ల్లో బాలికల ఎన్‌ రోల్ ‌మెంట్‌ పై దృష్టిసారించి విజయం సాధించారు. అలా గుజరాత్ మోడల్ గురించి విశ్వవ్యాప్తంగా తెలిసింది.

2014లో మొట్టమొదటగా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. కేంద్రంలోనూ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ, 2018లో ఆయుష్మాన్ భారత్ పథకం, 2019లో ఈబీసీ రిజర్వేషన్లు, బేటీ పడావో-బేటీ బచావో, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం.. ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న చట్టాలను సైతం మార్చేశారు. ఇదిలా తాజాగా యువతకి ఓ పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ యువత కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రానంతవరకు రాజకీయాల్లో కుటుంబ పాలన కొనసాగుతుంది అని ,సామాన్య యువకులు సైతం పార్లమెంట్ లో అడుగుపెట్టాలని ,జీవిత అనుభవాలనుండి పాఠాలు నేర్చుకోవాలని తెలిపారు. వివేకానందుడు చెప్పినట్టు శారీరక , మానసిక దృఢత్వం పెంచుకోవాలని అని తెలిపారు. ఏదేమైనా చాయ్ వాలా నుండి ప్రధాని వరకు ఎదిగిన అయన జీవితాన్ని ఒకసారి చూసి ,అయన స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి , దేశ అభివృద్ధి లో పాలుపంచుకోండి.