Begin typing your search above and press return to search.
మీ మొహమే ఏటీఎం.. కార్డులు ఫోన్లు అక్కర్లేదు..!
By: Tupaki Desk | 31 Jan 2021 5:00 AM ISTఇది డిజిటల్ యుగం. నగదు రూపంలో లావాదేవీలు చేయడం జనం మానేశారు. అంతా ఆన్ లైన్లోనే .. ఆన్లైన్ షాపింగ్‌లు, ఆన్లైన్ పేమెంట్లు ఇలా మొత్తం ఆన్లైన్లో సాగుతోంది వ్యవహారం. చిన్న చిన్న కిరాణాకొట్ల దగ్గర నుంచి.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అంతా డిజిటల్ రూపంలో లావాదేవీలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత సులభం కానున్నది. ఇప్పుడు మనం డిజిటల్ లావాదేవీలు చేయాలంటే ఏటీఎం కార్డు గానీ, మొబైల్ గానీ ఉండాలి. అయితే భవిష్యత్‌లో ఈ ప్రక్రియ మరింత సులభతరం కానున్నది.
ఫేస్రికగ్నైజేషన్ సాయంతో కేవలం మన మొహాన్ని చూసి పేమెంట్లు జరిగిపోనున్నాయి. ఇప్పటికే అమెరికాలో దీనిని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ఎవరైనా షాప్‌కు వెళితే ఏటీఎం కార్డు, మొబైల్ ఫోన్ ఏమీ తీసుకోకపోయినా కేవలం వారి ఫేస్రికగ్నైజేషన్ ద్వారా అకౌంట్లోని డబ్బులు కట్ అయిపోతాయి. అయితే ఈ విధానం ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యక్తిగత ప్రైవసీ ఉండదేమోనని కొందరు భావిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలోని పలు నగరాల్లో ఇప్పుడు చాలా మంది ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.
ఎలాంటి గుర్తుంపు కార్డులు లేకుండా.. నంబర్ కూడా చెప్పకుండా కేవలం ఫేస్ రికగ్నైజేషన్ ఈ -చెల్లింపులు సాగుతున్నాయి.
డెన్మార్క్, నైజీరియా వంటి దేశాల్లోనూ ఈ విధానం అమల్లోకి రానున్నది.
అయితే ఈ ప్రక్రియ మనదేశంలోకి రావాలంటే మాత్రం కొంత సమయం పట్టొచ్చని నిపుణులు అంటున్నారు.
అమెరికాకు చెందిన ‘పాప్ఐడీ’ అనే టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదట వెబ్‌సైట్‌లో మీ ముఖం ఫొటో అప్‌లోడ్ చేయటం ద్వారా సైనప్ కావాలి. అది సంస్థ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్‌లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మీ అకౌంట్‌ను మీ ఏటీఎం కార్డుకు అనుసంధానించాలి.
పాప్ ఐడీ ప్రధాన కార్యాలయం లాస్ ఏంజెలెస్‌లో ఉంది. అమెరికాలోని పలు నగరాల్లో, ముఖ్యంగా పశ్చిమ తీర నగరాల్లోని దాదాపు 70 శాతం స్వతంత్ర రెస్టారెంట్లు ఇప్పుడు పాప్‌ఐడీని వాడుతున్నాయి.
అయితే ఈ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు కూడా..మన వ్యక్తిగత ప్రైవసీకి ఈ విధానం భంగం కలిగిస్తుందన్నది వాళ్ల వాదన.