Begin typing your search above and press return to search.

వీడియో వైరల్: మాస్క్ పెట్టుకోమన్నందుకు డ్రైవర్ పై దగ్గిన యువతులు.. ఆపై..

By:  Tupaki Desk   |   12 March 2021 5:38 AM GMT
వీడియో వైరల్: మాస్క్ పెట్టుకోమన్నందుకు డ్రైవర్ పై దగ్గిన యువతులు.. ఆపై..
X
మాస్క్ పెట్టుకోమన్నందుకు యువతులు డ్రైవర్ పై దగ్గిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఉదంతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురు అమ్మాయిల తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

ఉబెర్ కారు ఎక్కిన ముగ్గురు యువతులను మాస్క్ పెట్టుకోమని భారత సంతతికి చెందిన డ్రైవర్ శుభాకర్ కోరారు. మాస్క్ పెట్టుకున్నాకే వాహనాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పాడు.

దీనిపై ఆగ్రహించిన ఆ ముగ్గురు యువతులు డ్రైవర్ ను తిట్టడం మొదలుపెట్టారు. ఒక యువతి నేరుగా డ్రైవర్ సమీపంలోకి వచ్చి గట్టిగా దగ్గింది. అంతేకాదు అతడి మొబైల్ ఫోన్ ను తీసి విసిరికొట్టింది.

శుభాకర్ తో ఆ ముగ్గురు యువతులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన అంతా వీడియోల్లో రికార్డ్ అయ్యింది.

ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. అక్కడి మీడియా కూడా దీన్ని ఎలుగెత్తి చాటింది. తాను భారతీయుడిని కావడం వల్లే యువతులు దురుసుగా ప్రవర్తించారని డ్రైవర్ శుభాకర్ ఆరోపించాడు.