Begin typing your search above and press return to search.
ప్రియుడే హంతకుడు.. వీడిన రెండేళ్ల కిందటి మర్డర్ మిస్టరీ!
By: Tupaki Desk | 12 Nov 2020 8:15 AM ISTఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 2018లో జరిగిన యువతి మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ఆ యువతిని ప్రియుడే చంపేసి.. ముక్కలు ముక్కలు చేసి తగలబెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి మీడియాకు వివరించారు.. గుంటూరుకు చెందిన ఓ యువతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకొనేది. అదే కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న అలీనగర్‌కు చెందిన షేక్ కరీం అలియాస్ నాగూర్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు.
అయితే యువతి చదువు పూర్తయ్యాక గుంటూరులోని ఓ టూవీలర్ షోరూంలో ఉద్యోగం చేసేది. ఆ సమయంలో షోరూంలో పనిచేస్తున్న రఫి అనే యువకుడితో ఆ యువతి సన్నిహితంగా మెలిగేది. దీంతో కరీం యువతిపై కక్ష పెంచుకున్నాడు. 2018 మే 25న కరీం యువతిని తన రూంకు తీసుకెళ్లాడు. అయితే తనను త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ యువతి అతడిపై ఒత్తిడి తెచ్చింది. వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండే నిన్ను పెళ్లిచేసుకోనంటూ కరీం ఆమెను దూషించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నది. కోపోద్రిక్తుడైన కరీం.. యువతి తలను గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ఆమె గొంతు నులిమి హతమార్చాడు.
అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు.. గోడలను కోసే వాల్ కట్టర్ యంత్రంతో యువతి శరీరభాగాలను ముక్కలుగా కోశాడు. చీకటి పడిన తర్వాత మూట కట్టి బైక్ పై సుద్దపల్లిడొంక దగ్గరలోని విజయశాంతినగర్‌లోని నిర్జన ప్రదేశంలోని చెట్టుపొదల్లో విసిరేశాడు. అనంతరం పెట్రోల్‌పోసి తగలబెట్టాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని యువతి మృతదేహం లభించడంతో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం బయటపడింది. కరీం ఈ హత్యచేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.