Begin typing your search above and press return to search.

నెల్లూరు జిల్లాలో ఘోరం: కిడ్నాప్ చేసి గదిలో నిర్బంధించి అత్యాచారం

By:  Tupaki Desk   |   20 July 2020 5:20 PM IST
నెల్లూరు జిల్లాలో ఘోరం: కిడ్నాప్ చేసి గదిలో నిర్బంధించి అత్యాచారం
X
ప్రేమించాలంటూ ఓ యువ‌తి వెంట‌ప‌డిన యువ‌కుడిని ఆమె నిరాక‌రించింది. అయినా బతిమిలాడాడు అయినా అతడి ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమెపై క‌క్ష పెంచుకున్నాడు. దీంతో ఆ యువ‌తిని కిడ్నాప్ చేసి ఓ గ‌దిలో నిర్బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివ‌రాలు ఇలా ఉన్నాయి..

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలానికి చెందిన ఓ యువ‌తి డిగ్రీ పూర్తి చేసి ఇంటి ద‌గ్గ‌రే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. అయితే ఎంత వెంట‌ప‌డినా ఆమె అంగీక‌రించ‌లేదు. అతడి ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో అమెను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 11వ తేదీన‌ ఇద్దరు స్నేహితుల సాయంతో ఆ యువతిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఓ గదిలో ఆమెను నిర్బంధించి ప‌లుసార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తన కోరిక తీర్చుకున్నాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ యువతి స్థానిక పోలీసుల‌ను ఆశ్రయించింది. అయితే ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ ను ఆశ్రయించింది. అనంతరం త‌న‌కు న్యాయం చేయాలంటూ నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ కొనసాగుతోంది.