యువతులకు ప్రేమ వల వేసి లెక్చరర్ బ్లాక్ మెయిల్

Wed May 27 2020 05:00:01 GMT+0530 (IST)

young lecturer trap lady students and black mail

విద్యాబుద్దులు చెప్పాల్సిన లెక్చరర్ విద్యార్థులకు వలవేశాడు. యువతుల ఫోన్ నంబర్లు సేకరించి వారితో పరిచయం పెంచుకొని వారిని ప్రేమిస్తున్నాంటూ లైంగిక సంబంధం పెట్టుకునేవాడు. కోరికలు తీర్చుకున్నాక వారిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. కీచక లెక్చరర్ పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీడి బండారం బట్టబయలైంది.నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఒక యువకుడడు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఓ ప్రైవేటు కాలేజీ లో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ వాడడంలో ప్రావీణ్యం ఉన్న లెక్చరర్ యువతులు విద్యార్థినులు వివాహితుల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారిని ఆకట్టుకునేలా మెసేజ్ లు పంపుతూ ప్రేమలోకి దింపేవాడు.. వారి ఫొటోలు సేకరించేవాడు. వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. అలా భయపడి అతడి వద్దకు వచ్చిన ఆడవారితో కామ కోరికలు తీర్చుకునేవాడు. చెప్పినట్టు వినకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు.

చాలా మందిని లెక్చరర్ ఇలానే మోసం చేసేవాడు. అతడి వలలో పడి మోసపోయిన ఒక యువతి ధైర్యం చేసి నెల్లూరు దిశ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్ ఫోన్ ను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మహిళలతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ అమ్మాయిల నగ్న చిత్రాలు వీడియోలు ఉన్నాయి. దీంతో ఇతడి వలలో పడి మోసపోయిన బాధితులు చాలా మంది అని పోలీసులు భావించారు. జిల్లాలోని కావలి ఉదయగిరి వింజమూరు గూడురులతోపాటు తిరుపతిలోనూ అతడి బారిన పడి అనేకమంది యువతులు మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. బెయిల్ కూడా రాని కఠిన సెక్షన్ల కింద లెక్చరర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.