Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్‌ ను క‌లిసిన కొత్త ఐఏఎస్‌ లు!

By:  Tupaki Desk   |   23 May 2020 1:30 PM GMT
సీఎం జ‌గ‌న్‌ ను క‌లిసిన కొత్త ఐఏఎస్‌ లు!
X
ఐఏఎస్‌లుగా శిక్ష‌ణ పూర్తి చేసుకుని ప్రొబేషనరీకి వ‌చ్చిన 2019-బ్యాచ్‌ ఏపీ కేడర్ ఐఏఎస్‌లు శనివారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జ‌గ‌న్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. యువ ఐఏఎస్‌ అధికారులను సీఎం జ‌గ‌న్ అభినందించి నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందించి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అని గుర్తుచేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌ను యువ ఐఏఎస్‌లు ఎం.నవీన్‌, నిధి మీనా, చహత్‌ బాజ్‌పాయ్‌, వికాస్‌ మర్మత్‌, వి.అభిషేక్‌, జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, సి.విష్ణు చరణ్‌ కట్టా సింహాచలం, అపరాజిత సింగ్‌ సిన్సివర్‌, భావన వశిష్ట్ క‌లిశారు.

వారితో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఓ మహిళేనని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టాన్ని తేవ‌డంతో పాటు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసిన‌ట్లు వివరించారు. వాలంటీర్ల వ్యవస్థ, మహిళా సాధికారత కోసం ప్రభుత్వ చర్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలిపారు.

గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాధ్యమవుతుందని ఈ సంద‌ర్భంగా యువ ఐఏఎస్‌లు తెలిపారు. నిన్నటి వరకు పరిపాలనకు సంబంధించి అనేక అంశాలు నేర్చుకున్నామ‌ని, ఇప్పుడు నేరుగా ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నట్లు వారు చెప్పారు.