Begin typing your search above and press return to search.
ఐపీఎల్ డబ్బు చెడగొడుతోంది..యువరాజ్ సంచలనం
By: Tupaki Desk | 10 April 2020 3:00 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కారణంగా యువ క్రికెటర్లు - కుర్రాళ్లు చెడిపోతున్నారని టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో ఆడిన యువ క్రికెటర్లకు భారీ మొత్తంలో డబ్బు వచ్చిపడుతోందని.. దాన్ని ఏం చేయాలో తెలియక కుర్రాళ్లు తప్పుడు మార్గంలో వెళుతున్నారని యువరాజ్ హాట్ కామెంట్స్ చేశారు.
యువ క్రికెటర్లు దేశానికి - టెస్టులు - రంజీలు ఆడడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదని.. కేవలం ఐపీఎల్ లో ఆడి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారని యువీ మండిపడ్డారు. డబ్బే లోకంగా క్రికెట్ ఆడుతున్నారన్నారు. ఈ డబ్బుతో చిన్న వయసులోనే ఏకాగ్రత చెదిరి వేరే అంశాలపై దృష్టి మరలుతోందన్నారు.
కుర్రాళ్లు గైడెన్స్ ఇచ్చేవారే కరువయ్యారని యువరాజ్ తెలిపారు. తనకు సచిన్ బాగా సలహాలు ఇచ్చాడని.. బాగా ఆడితే చాలు మిగతావన్నీ నీ వెంటే వస్తాయని ప్రోత్సహించాడని యువీ తెలిపాడు. కానీ ఇప్పుడు మంచి మాటలు చెప్పే వారే లేరని అన్నారు. కోచ్ - కెప్టెన్ లు యువ ఆటగాళ్లకు సలహాలివ్వాలని కోరాడు.
ఈ తరం క్రికెటర్లను చూస్తే బాధేస్తోందని.. మూడు ఫార్మాట్లు ఆడేవారే దేశంలో కరువు అవుతున్నారని యువీ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశంలో కోహ్లీ - రోహిత్ తప్ప మూడు ఫార్మాట్లు ఆడే మరో క్రికెటర్ లేడని యూవీ కామెంట్ చేశాడు.