Begin typing your search above and press return to search.

ఇలాంటి వార్త మీరెప్పుడు చదవి ఉండరు.. చదివాక ఎవరో ఒకరికి చెప్పకుండా ఉండలేరు

By:  Tupaki Desk   |   19 July 2021 6:30 AM GMT
ఇలాంటి వార్త మీరెప్పుడు చదవి ఉండరు.. చదివాక ఎవరో ఒకరికి చెప్పకుండా ఉండలేరు
X
ఆసక్తిని క్రియేట్ చేయటం కోసమో.. పక్కదారి పట్టించేందుకు వీలుగా.. క్లిక్ కక్కుర్తి కోసం పెట్టిన హెడ్డింగ్ కాదిది. నిజంగానే నిజం. ఇప్పుడీ వార్త చదివిన తర్వాత.. నిజంగానా? అన్న ఆశ్చర్యంతో పాటు.. ఇలా కూడా చేస్తారా? అన్న విస్మయం కలగటంతో పాటు.. ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి మీ ఇంట్లో వారికి కానీ.. తెలిసినోళ్లకు తప్పకుండా చెప్పేయటం ఖాయం. ఇంతకీ ఏమిటా ఆసక్తికర వార్త అంటున్నారా? అక్కడికే వస్తున్నాం.

మిగిలిన ప్రాంతాలకు భిన్నమైన కల్చర్ తెలుగు వారిలో కనిపిస్తూ ఉంటుంది. అందులోకి.. మర్యాదలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గోదావరి ప్రాంతంలో జరిగే పెళ్లిళ్లు ఒక రేంజ్ లో జరుగుతాయి. ఇక.. సంపన్నుల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లు.. వేడుకల స్థాయి మరో లెవల్ లో ఉంటుంది. పెళ్లి తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే వేళలో కానుకలు భారీగా ముట్టచెప్పటం మామూలే. ఈ సందర్భంగా స్వీట్లు.. ఇంటి సామాగ్రి తదితర వస్తువుల్ని ‘‘సారె’’ పేరుతో పంపుతారు.

తాజాగా అలా పంపిన ‘సారె’ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరిని ఆకర్షిస్తూ.. పలువురు నోట నానుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన ఒక ధనికుడి ఇంటికి.. యానాంకు చెందిన వరుడితో పెళ్లి జరిపారు. ఈ
సందర్భంగా కుమార్తెను అత్తారింటికి పంపిన సందర్భంగా అమ్మాయి తరపు వారు.. కనివినీ ఎరుగని రీతిలో సారెను సిద్దం చేసి పంపారు. యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు కుమారుడు పవన్ కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామక్రిష్ణ కుమార్తె ప్రత్యూషకు పెళ్లైంది. ఆషాఢం నేపథ్యంలో కుమార్తెను ఇంటి నుంచి అత్తారింటికి పంపిన కావిళ్లు అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాయి.

సారెలో భాగంగా.. వెయ్యి కేజీల చెరువు చేపలు.. పండుగొప్ప చేపలు.. కొరమేనుు.. రొయ్యలు.. 250 కేజీల బొమ్మిడాలు.. 10 మేకపోతులు.. 50 పందెం పుంజులు.. వెయ్యి కేజీల్ కూరగాయలు.. 250 కేజీల కిరాణా సామాగ్రి.. 200 అవకాయ జాడీలు.. 50 రకాల స్వీట్లు తదితర వస్తువుల్నిపంపారు. ఈ భారీ వస్తువులను రాజమహేంద్రపురం నుంచి యానం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లిన వైనం రెండు ప్రాంతాల్లో ఆసక్తికరంగా మాట్లాడటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి వార్త ఎప్పుడైనా విన్నారా?