Begin typing your search above and press return to search.
రేప్ బాధితులను బిచ్చగాళ్లలా చూస్తారా?
By: Tupaki Desk | 16 Feb 2018 10:04 AM ISTన్యాయం విషయలో సర్వోన్నత న్యాయస్థానమే షాక్ కు గురైంది. తన విస్మయాన్ని తీర్పు సందర్భంగా ఆశ్చర్యం రూపంలో వెల్లడించింది. `ఒక లైంగికదాడి ఖరీదు రూ.6 వేలా? ఇంత స్వల్పమొత్తం అందజేసి అత్యాచార బాధితులపై ప్రభుత్వం దయచూపుతోందా?` అని మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం విడుదల చేసిన నిర్భయ నిధుల నుంచి పెద్ద మొత్తంలో మధ్యప్రదేశ్ కు అందినా బాధితులకు తక్కువ మొత్తం అందించడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని సుప్రీంకోర్టు పేర్కొంది. 2012 డిసెంబర్ 16 నాటి నిర్భ య ఘటన తర్వాత లైంగికదాడుల బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నిర్భయ పథకాన్ని తెచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం - ఒక్కో అత్యాచార బాధితురాలికి సగటున రూ.6వేల ఆర్థిక సాయం అందుతోంది.
`మీరేమన్నా వారికి దానమిస్తున్నారా? రూ.6వేలతో వెలకట్టడమేమిటి?` అని సుప్రీంకోర్టు మండిపడింది. మధ్యప్రదేశ్ లో 1,951 మంది బాధితులున్నారు. వారికి మీరు రూ.6 వేల నుంచి రూ.6,500 ఇస్తున్నారు. ఇదేమన్నా సబబా? అని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని జస్టిస్ మదన్ బీ లోకూర్ - జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడా ధర్మాసనం ప్రశ్నించింది. బాధితులకు తగు న్యాయం చేసేలా పాలకులు ఉండాలని సూచించింది.
కాగా, లైంగికదాడుల బాధితులకు నిర్భయ పథకం కింద అందజేసిన సాయం వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించినా పట్టించుకోని హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నిర్భయ మూలధన పథకం కింద కేంద్రం నుంచి అందిన మొత్తమెంత? బాధితులెంతమంది? ఎంత మందికి నిర్భయ పథకం కింద సాయం అందించారు? వివరాలను తెలపాలని గత నెలలోనే సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. 24రాష్ర్టాలు - కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా అఫిడవిట్ సమర్పించాలి. త్వరలో అఫిడవిట్ దాఖలు చేస్తామని హర్యానా ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించగా - అఫిడవిట్ సమర్పించకపోడంలోనే మహిళల రక్షణ పట్ల మీ ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకా అఫిడవిట్ దాఖలు చేయని రాష్ర్టాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం అఫిడవిట్ సమర్పించేందుకు మీ ఇష్టమున్నంత సమయం తీసుకోండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోలేమని మీమీ రాష్ర్టాల్లోని మహిళలకు చెప్పండి అని ధర్మాసనం ఆగ్రహించింది.
సిక్కిం తరపునే ఒక అఫిడవిట్ దాఖలైంది. 48 మంది బాధితులకు రూ.30.55 లక్షలు అందించామని మరో రాష్ట్రం మేఘాలయ సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఇప్పటికైనా అన్ని రాష్ర్టాలు స్పందిస్తే బాగుంటుందన్న సుప్రీంకోర్టు - నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. నిర్భయ పథకం కింద అత్యాచార బాధితులకు సాయం అందించడంలో రాష్ర్టాల సహాకారం సరిగా లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంతకుముందు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నిర్భయ ఘటన తర్వాత ఇంతవరకు సుప్రీంకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి.