Begin typing your search above and press return to search.

నడిచే మహిళలను చూసి శృంగార సామర్థ్యం చెప్పొచ్చట

By:  Tupaki Desk   |   29 Feb 2020 12:30 PM IST
నడిచే మహిళలను చూసి శృంగార సామర్థ్యం చెప్పొచ్చట
X
మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార సామర్థ్యాన్ని చెప్పవచ్చని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు. స్కాట్ ల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టూవర్ట్ బ్రాడీ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చింది.

ఈ బృందం వివిధ ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు. సెక్సాలజీ కి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు ఈ చిత్రీకరణలను పలు రకాలుగా విభజించారు. విశ్లేషణల ప్రకారం పెద్ద పెద్ద అంగలతో, నడుము తిప్పుతూ నడిచే వారు మంచి శృంగార అవయవాలను కలిగి ఉంటారని నిర్ణయించారు. మహిళ శరీర సౌష్టవం కూడా వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధన లో వెల్లడైంది. సరిగ్గా సైకాలజిస్టులు, వీరు చెప్పిన అభిప్రాయాలు చాలా మటుకు మగవారు ఏకీభవించారు.

మొద్దుబారిపోయిన కటి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు బ్రాడీ తెలిపారు. కండరాలు మొద్దుబారి పోవడం వలన ఈ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు. లైంగిక అవయవాలు పటిష్టం గా ఉన్న మహిళలలో శృంగార విశ్వాసం ఉట్టి పడుతుంటుంది. అదేవారి నడకపై ఆధార పడి ఉంటుంది. ఆ విశ్వాసం కూడా లైంగికంగా ఆమెకున్న సంబంధం, సంతృప్తి తీవ్రతను అనుసరించి ఉంటుంది. సో ఇలా అవయవాల సౌష్టవం ఆధారం గా శృంగారం స్థాయి ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేలింది.