Begin typing your search above and press return to search.

యోగి తెలివే తెలివి.. రైతు ఉద్యమానికి.. రామమందిరానికి భలేగా లంకె వేశారే?

By:  Tupaki Desk   |   18 Dec 2020 9:47 AM IST
యోగి తెలివే తెలివి.. రైతు ఉద్యమానికి.. రామమందిరానికి భలేగా లంకె వేశారే?
X
మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టేసే మహత్తర కార్యక్రమానికి తెర తీశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. ఢిల్లీ శివారులో మూడు వారాలకు పైగా సాగుతున్న రైతుల ఉద్యమానికి.. అక్కడెక్కడో ఉన్న అయోధ్య రామ మందిరానికి సంబంధాన్ని తెర మీదకు తెచ్చేశారు. సంచలనంగా మారిన ఆయన వ్యాఖ్యల్లో కీలకమైనది.. రైతుల ఉద్యమం పేరుతో దేశంలో అశాంతిని రేకెత్తిస్తున్నారని.. అయోధ్య రామ మందిరంపై ఉన్నకోపాన్ని రైతుల ఆందోళన మాటున తీర్చుకుంటున్నట్లుగా ఆరోపించారు.

తాజాగా పశ్చిమ యూపీలో జరిగిన కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేశం ఏక్ భారత్ కావటం ఇష్టం లేదు. శ్రేష్ట భారత్ కావటం ఇష్టం లేని వాళ్లు ఆసూయతో రగిలిపోతుననారు. రైతుల ధర్నాలో నేను దాన్ని చూశా’ అంటూ పొంతన లేని వాదనను వినిపించారు. కనీస మద్దతు ధర ఇష్యూ ఎక్కడ ఉందో రైతు సంఘాలు చెప్పాలన్నారు.ఎంఎస్ పీ ల మీద వెనక్కి తగ్గమని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు రైతుల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ప్రశ్నించారు.

‘‘వారి కోపానికి కారణం అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుండటమే. రామ మందిర నిర్మాణాన్ని మోడీ ప్రారంభించటమే వారి కోపానికి కారణం. రైతులకు సాయం చేసేందుకు ప్రధాని అద్భుతమైన ప్రయత్నాన్ని చేస్తున్నారు. కమ్యూ‘నిజం’లో ఎప్పుడూ నిజం లేదు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అది నిజం అయిపోతుందని వారు భావిస్తున్నారు. రైతులు జీవితాలు బాగుపడటం ఇష్టం లేని వాళ్లే అక్కడ ఉన్నారు’’ అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏమైనా.. రైతుల ఉద్యమానికి ఏ మాత్రం సంబంధం లేని రామ మందిరం ఇష్యూను తెర మీదకు తీసుకొచ్చిన తీరు చూస్తే.. యోగిలోని టాలెంట్ విస్మయానికి గురి చేయక తప్పదు.