Begin typing your search above and press return to search.

ల్యాప్ ట్యాప్ వాడటం తెలియని సీఎం ఈయనే

By:  Tupaki Desk   |   1 May 2019 9:35 AM GMT
ల్యాప్ ట్యాప్ వాడటం తెలియని సీఎం ఈయనే
X
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.. 80కు పైగా లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ సీట్లు సాధిస్తే ఢిల్లీలో అధికారం చేపట్టడానికి దగ్గరి దారి అవుతుంది. అటువంటి పెద్ద రాష్ట్రంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేడి మహారంజుగా సాగుతోంది. బీజేపీ తరుఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక ఆయనకు పోటీగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జోరుగా ప్రచారం చేస్తున్నారు.

అయితే ఎన్నికల ప్రచారం వేళ.. మాటల తూటాలు పేలుతున్నాయి. ల్యాప్ ట్యాప్ ల ఇష్యూ దుమారం రేపుతోంది. తాజాగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో యువతకు ల్యాప్ ట్యాప్ లు ఇచ్చామని.. వాటిని చాలా మంది సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. అదే యోగికి ల్యాప్ ట్యాప్ వాడటం రాదని.. అందుకే వారికి ల్యాప్ ట్యాప్ లను ఇవ్వడం లేదని అన్నారు.

ఇక యోగి కుట్రలను కూడా అఖిలేష్ యాదవ్ బయటపెట్టారు. తమ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి యోగి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. లోక్ సబ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నేతలను ముఖ్యమంత్రి యోగి టార్గెట్ చేశారని.. కొందరు వ్యక్తులను ఇందుకు పావులుగా వాడుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. లక్నోలో మెట్రోను తాము రికార్డు స్థాయిలో పూర్తి చేశామని.. లక్నో ఎక్స్ ప్రెస్ మైవేను 24నెలల్లోనే 302 కిమీల రోడ్డును పూర్తి చేశామన్నారు. ఇలా యోగి-అఖిలేష్ మాటల మంటలు రాజుకుంటున్నాయి.