Begin typing your search above and press return to search.

యోగా ఒక రక్షక కవచం, త్వరలో ఎం-యోగా యాప్ :ప్రధాని మోదీ !

By:  Tupaki Desk   |   21 Jun 2021 10:30 AM GMT
యోగా ఒక రక్షక కవచం, త్వరలో ఎం-యోగా యాప్ :ప్రధాని మోదీ !
X
ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేడు ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోందని, ఈ మహమ్మారిని ఓడించగలమనే నమ్మకాన్ని యోగా అందిస్తున్నదన్నారు. ఒత్తిడి తగ్గించడంలో, శారీరక బలాన్నిపెంపొందింపజేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పబ్లిక్ హెల్త్ కేర్ విషయంలోనూ యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యోగాపై ప్రజలకు ఆసక్తి పెరిగిందని, ఉత్సాహంగా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. కోవిడ్ కాలంలో యోగాపై ప్రజలకు మరింత ఆసక్తి పెరిగిందన్నారు. యోగా కారణంగా మన శరీరానికి జరిగే మేలు గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని మోడీ తెలిపారు.

యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. యోగా అనేది శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, అంతః చైతన్యాన్ని వృద్ధి చేస్తుందని తెలిపారు. అనేక వ్యాధులకు ముందస్తు రక్షణ కవచంగా యోగా ఉపయోగపడుతుందని ప్రధాని అన్నారు. ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా మాట్లాడుతూ యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని మోదీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని, యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. దీనిద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవవచ్చని తెలిపారు. యోగాను ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనాతో భారత్‌ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి.

దేశంలోని ప్రతి చోటు నుంచి చాలా మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. యోగా ఫర్ వెల్ నెస్ థీమ్‌తో ఈ ఏడాది యోగా డేని నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో లక్షలాదిమంది యోగ సాధకులుగా మారారని అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లినట్టు చెప్పారు. కరోనా మహమ్మారిపై ప్రతి ఒక్కరు పోరాడాల్సి ఉందని అన్నారు. కరోనా వెలుగుచూసినప్పుడు దానిని ఎదుర్కొనేందుకు ఏ దేశమూ సిద్ధంగా లేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో త్వరలోనే ఎం-యోగా అప్లికేషన్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇందులో యోగా శిక్షణకు సంబంధించి పలు భాషల్లో వీడియోలు ఉంటాయన్నారు. దీనివల్ల ‘ఒకే దేశం-ఒకే ఆరోగ్యం’ లక్ష్యం సాకారమవుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.