Begin typing your search above and press return to search.

బీజేపీ పురస్కారాలు.. కొత్త లొల్లి

By:  Tupaki Desk   |   27 Jan 2019 10:52 AM IST
బీజేపీ పురస్కారాలు.. కొత్త లొల్లి
X
బీజేపీ పాలనలో ఏదైనా సాధ్యమే.. ఒక్క భారత రత్న ఇవ్వడానికే కాంగ్రెస్ పాలనలో తర్జన భర్జన పడేవారు. కానీ బీజేపీ మాత్రం సంవత్సరానికి ఒకరికి మించి భారతరత్నలను ప్రకటిస్తోంది. ఇందులో కొన్ని స్వార్థ ప్రయోజనాలు.. మరికొన్ని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది.

ఇటీవల బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటూ ఆర్ ఎస్ ఎస్ కు ప్రత్యామ్మాయ ప్రధానిగా కనిపిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ తాజాగా ‘భారతరత్న’ అవార్డు ప్రకటించడాన్ని అందరూ హర్షించారు. కానీ దీనివెనుక వేరే అర్థం - పరమార్థం వేరే ఉందంటున్నాయి ఢిల్లీ వర్గాలు.. 2019లో తేడా కొడితే ప్రధానిగా గడ్కరీ - ప్రణబ్ ముఖర్జీలను ఆర్ ఎస్ ఎస్ తెరపైకి తెస్తుందన్న వాదనలున్నాయి. అందుకే ఇలా సెట్ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

ఇక ఈ అవార్డులు బీజేపీ అనుకూలురలోనూ చిచ్చు రేపాయి. తాజాగా యోగా గురువు, పతంజలి గ్రూపు పెద్దాయన బాబా రాందేవ్ బీజేపీపై ఆడిపోసుకున్నారు. అంతమందికి భారత రత్న ఇస్తున్నారని.. ఒక్క సన్యాసికి ఇవ్వరా అని ప్రశ్నించారు. దయానంద సరస్వతి - స్వామి వివేకనంద - శివకుమార స్వామి సహా బీజేపీ ఏ సన్యాసికి భారతరత్న ఇవ్వలేదని.. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇలా బీజేపీ ప్రయోజనార్థం ఇస్తున్న అవార్డులు సొంత కుంపటిని - అసంతృప్తిని రాజేస్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ అడుగుజాడల్లో నడుస్తూ పురస్కారాలు ఇస్తున్న బీజేపీ.. ఈ సన్యాసులపై కూడా ఓ కన్నేస్తే మంచిదేమో.