Begin typing your search above and press return to search.
నిన్న టీడీపీ - నేడు బీజేపీ.. ఆలయాలపై లొల్లి షురూ
By: Tupaki Desk | 5 Jan 2021 4:30 PM ISTనిన్న చంద్రబాబు విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు బీజేపీ దాన్ని అందిపుచ్చుకుంటోంది. తాజాగా బీజేపీ ‘చలో రామతీర్థం’ పిలుపును ఇచ్చింది. జనసేనను కలుపుకొని పోరుబాటకు శ్రీకారం చుట్టింది.
విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తంగా మారింది.బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవ్వగా ఇప్పటికే కొందరినీ గృహనిర్బంధం చేశారు. రామతీర్థం వెళ్లకుండా ఆ గ్రామ కూడలి వద్ద పోలీసులు మోహరించారు.అక్కడికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశించారు.
సోము వీర్రాజు కార్యకర్తలతో రామతీర్థంకు రాగా.. సోము వీర్రాజుతోపాటు పలువురు బీజేపీ నాయకులను కూడా అదుపులోకి తీసుకొని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోము వీర్రాజును అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు తీవ్రవాగ్వాదం తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ, జనసేన కార్యకర్తలు రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు.
రామతీర్థం ధర్మయాత్రకు ముందుగానే పిలుపునిచ్చినప్పటికీ పోలీసులు అనుమతి లేకుండా అడ్డుకోవడం దారుణమని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. ఆలయ సందర్శనకు అనుమతిచ్చినట్టు చెప్పి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ నాయకులను రామతీర్థం వెళ్లనిచ్చి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు అండ్ కో రామతీర్థంలో చేసిన రచ్చకు ఏపీ ప్రభుత్వం కాస్త ఆటంకపరిచింది. అయినా చంద్రబాబు ఆలయానికి చేరుకొని రచ్చ చేశారు. ఇప్పుడే అదే క్రమంలో బీజేపీ వెళుతుండగా ముందుగానే పోలీసులు అలెర్ట్ అయ్యి అరెస్ట్ చేశారు. ఇక బీజేపీ-జనసేన కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం ముందుగానే అడ్డుకోవడంతో వీరి షోకు తెరపడింది.