Begin typing your search above and press return to search.

ఏర్పేడు మార‌ణ‌హోమానికి కార‌ణం ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   25 April 2017 5:46 AM GMT
ఏర్పేడు మార‌ణ‌హోమానికి కార‌ణం ఇదేన‌ట‌!
X
ఒక లారీ ప‌దిహేడు మంది మ‌ర‌ణానికి కార‌ణం కావ‌టం సాధ్య‌మేనా? అన్న సందేహాలు తీర్చేసి.. పుట్టెడు శోకాన్ని బాధితులకు మిగిల్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వీటి సంగ‌తి ఎలా ఉన్నా.. పోలీసుల వ‌ర‌కూ పోలీసులు ఏం చెబుతున్నారు? వారు చేస్తున్న విచార‌ణ‌లో అధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన అంశాలేమిటి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికితే ఆశ్చ‌ర్యానికి గురి కావాల్సిందే. శుక్ర‌వారం జ‌రిగిన ఈ దారుణానికి సంబంధించి.. ఇప్ప‌టివ‌ర‌కూ పోలీసులు ఒక క్లారిటీ రాక‌పోవ‌టం విస్మ‌యానికి గురి చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ ప్ర‌మాదానికి సంబంధించి ఆదివారం కీల‌క‌మైన సీసీ పుటేజ్ కూడా ల‌భించింది. ఇందులో లారీ న‌డిపింది.. క్లీన‌ర్ అన్న విష‌యం స్ప‌ష్ట‌మ‌య్యాక కూడా.. పోలీసులు ప‌లు సందేహాల చిక్కుముడుల‌తో ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన డ్రైవ‌ర్‌.. క్లీన‌ర్‌ ల‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసుల‌కు.. వారిరువురు పొంత‌న లేని సమాధానాలు చెబుతున్న‌ట్లుగా చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ ల‌భించిన త‌ర్వాత కూడా వారెందుకు సంబంధం లేని మాట‌లు చెబుతున్నార‌న్న‌ది అర్థం కానిది.

ఈ ప్ర‌మాదం ఎందుకు చోటు చేసుకుంద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ అధికారులు చెప్ప‌న‌ప్ప‌టికీ.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. పోలీసుల విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డిన అంశాల్ని చూస్తే.. గురువారం రాత్రి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి బ‌య‌లుదేరిన లారీ శుక్ర‌వారం క‌డ‌ప‌కు చేరుకుంది. అక్క‌డి నుంచి రేణిగుంట వ‌ర‌కూ డ్రైవ‌ర్ గుర‌వ‌య్య‌.. క్లీన‌ర్ సుబ్ర‌హ్య‌ణ్యం మార్చి మార్చి న‌డిపిన‌ట్లుగా చెబుతున్నారు. ఉద‌యం రేణిగుంట చెక్ పోస్ట్ కూడ‌లికి చేరుకొని.. అక్క‌డ ఫుల్‌ గా తాగేసి.. భోజ‌నం చేసేసిన‌ట్లుగా తెలుస్తోంది. త‌మ లారీ య‌జ‌మాని ర‌మేశ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట‌లో ఉన్నందున‌.. ఆయ‌న్ని క‌లిసేందుకు విశాఖ‌ప‌ట్నం - చెన్నై హైవేలో వెళ్లాల‌ని నిర్ణయించుకున్నారు.

డ్రైవ‌ర్ గుర‌వ‌య్య ఫుల్‌ గా తాగేసి ఉండ‌టంతో.. డ్రైవింగ్ చేయొద్దంటూ చెప్పిన క్లీన‌ర్ తాను స్టీరింగ్ చేతికి తీసుకున్నాడు. క్లీన‌ర్ బండి న‌డుపుతుండ‌టంతో డ్రైవ‌ర్ నిద్ర‌పోయాడు. ఏర్పేడు చేరేస‌రికి తాను కూడా మ‌గ‌త‌లో ఉన్న‌ట్లుగా క్లీన‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం చెబుతున్నాడు. తాను తెలివిలోకి వ‌చ్చేస‌రికి దారుణం జ‌రిగిపోయిన‌ట్లుగా చెబుతున్నాడు. క్ష‌నాల్లో లారీ రోడ్డు ప‌క్క‌కు దూసుకెళ్ల‌టం.. రెండు ఆటోలు.. పోలీసు జీపు.. పోలీస్ స్టేష‌న్ ఎదుట ఉన్న జ‌నాలపైకి పోవ‌ట‌మే కాదు.. క‌రెంటు పోల్‌ ను ఢీ కొని.. పెద్ద శ‌బ్దం రావ‌టంతో త‌న‌కు ఒక్క‌సారి తెలివి వ‌చ్చింద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా అర్థ‌మైన‌ప్ప‌టికీ.. ఇంత దారుణం జ‌రిగి ఉంటుంద‌ని తాను అనుకోలేద‌ని క్లీన‌ర్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే డ్రైవ‌ర్ ను నిద్ర లేపేందుకు ప్ర‌య‌త్నించాన‌ని చెప్పాడు. లారీ య‌జ‌మాని.. డ్రైవ‌ర్‌.. క్లీన‌ర్‌ను వేర్వేరుగా ప్ర‌శ్నించిన పోలీసులు.. ఒక‌రికొక‌రు పొంత‌న‌లేని స‌మాధానాలు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌మాద‌స‌మ‌యంలో లారీ న‌డిపించి తానేన‌ని క్లీన‌ర్‌.. డ్రైవ‌ర్ చెప్పగా.. చివ‌ర‌కు క్లీన‌రే న‌డిపిన‌ట్లుగా పోలీసులు గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు. దుర్మార్గ‌మైన విష‌యం ఏమిటంటే.. అంత పెద్ద లారీని న‌డిపిన డ్రైవ‌ర్ గుర‌వ‌య్య‌కు లైట్ వెహికిల్ లైసెన్స్ మాత్ర‌మే ఉండ‌గా.. క్లీన‌ర్ సుబ్ర‌మ‌ణ్యానికి లైసెన్సే లేక‌పోవ‌టం చూస్తే.. వారెంత బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది ఇట్టే తెలుస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/