తల్లి అయిన ఇల్లెందు ఎమ్మెల్యే.. పాపకు పేరు పెట్టిన కేసీఆర్

Fri Oct 07 2022 18:12:49 GMT+0530 (India Standard Time)

yelllandu mla banoth haripriya become mother dussehra kcr named baby

హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆవిర్భావం రోజునే ఆ పార్టీకి మరో గుడ్ న్యూస్ వచ్చింది. అదే రోజు బుధవారం ఉదయం ఆ పార్టీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది.బీఆర్ఎస్ ఆవిర్భావం వేళ జన్మించిన బిడ్డకు ‘సుచిత్ర భారత ప్రియ’గా నామకరణం చేయాలని తనను కలిసిన హరిసింగ్ నాయక్ కు సీఎం కేసీఆర్ సూచించినట్టు సమాచారం.

ఇల్లందు పట్టణంలోని రావూస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆడబిడ్డకు హరిప్రియ జన్మనిచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన సందర్భంగా హరిప్రియ నాయక్ దంపతులకు పలువురు టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులు అనుచరులు శుభాకాంక్షలు తెలిపారు. హరిప్రియ దంపతులకు ఇరవై ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడం విశేషం. అదే రోజు దసరా కావడంతో వారి ఆనందం రెట్టింపు అయ్యింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నేతలు అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. హరిప్రియ నాయక్ కు పువ్వాడ అజయ్ కుమార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అటు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే హరిప్రియనాయక్ ను పరామర్శించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక టీఆర్ఎస్ నేతలు ఆమె అనుచరులు ఆస్పత్రికి చేరుకొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్.. ఆ తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.