Begin typing your search above and press return to search.

మోడీపై యడ్యూరప్ప ఘాటు వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   21 Sep 2021 4:48 AM GMT
మోడీపై యడ్యూరప్ప ఘాటు వ్యాఖ్యలు
X
కర్ణాటక సీఎం పదవి నుంచి బీజేపీ అధిష్టానం ఒత్తిడి మేరకు వైదొలిగిన యడ్యూరప్ప తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత, ప్రధాని మోడీ గురించి తక్కువ చేసిన మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ‘రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదని.. రాష్ట్రంలో అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని బట్టే ఎన్నికల్లో గెలుపోటములు ఉంటాయని ’ యడ్యూరప్ప అన్నారు.

కేంద్రంలో ప్రధాని మోడీ చాలా పనులు చేస్తున్నారని.. కేంద్రంలో మళ్లీ మోడీ పాలనే వస్తుందని..కానీ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించాలంటే అభివృద్ధి పనులు తప్పనిసరి అని యడ్యూరప్ప అన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మేల్కొన్నదని.. ఆ పార్టీ ఎత్తులను చిత్తు చేయాలంటే అభివృద్ధి ఒక్కటే మంత్రమని యడ్యూరప్ప పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని ఆయన పేర్కొన్నారు.

త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్, సిందగీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక జరుగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఎలాగైనా సరే గెలిచి పట్టు నిరూపించుకోవాలి. ఇది పార్టీకి అగ్ని పరీక్షల లాంటిదిగా చెప్పొచ్చు.

అయితే సీఎం పదవి నుంచి వైదొలగిన యడ్యూరప్ప తాజాగా ‘మోడీ వేవ్’ మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించడంతో ఆయన బీజేపీకి సపోర్టుగా లేడని అర్థమవుతోంది. అసంతృప్తితో రగిలిపోతున్నాడని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ పక్కన పెట్టిన సీనియర్లు యడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్, డీవీ సదానందగౌడ, నళిన్ కుమార్ కటిల్ లతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను అంచనా వేయబోతున్నారు.