Begin typing your search above and press return to search.
బెజవాడ తూర్పులో వైసీపీ వార్
By: Tupaki Desk | 20 Dec 2020 4:03 PM ISTఅధికార వైసీపీలోకి టీడీపీ నుంచి వచ్చి చేరిన నేతలతో లొల్లి మొదలవుతోంది. ఇప్పటికే నిన్న గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు వైసీపీలో ఆదినుంచి ఉన్న వారికి పెద్ద ఫైటింగ్ జరిగింది. అది మరిచిపోకముందే బెజవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నేత దేవినేని అవినాష్ బ్యానర్స్ చించివేయడం కలకలం రేపింది. అవినాష్ కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేత కావడంతో స్వతహాగా వైసీపీలో ఉన్న నేతలు ఆయనపై ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
విజయవాడ వైసీపీలో ఫెక్సీల రగడ మొదలైంది. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ కాస్తా ఇప్పుడు ఫ్లెక్సీలు చించుకునే వరకు వచ్చింది.
వైసీపీ అధినేత, సీఎం జగన్ బర్త్ డే నేపథ్యంలో వైసీపీలోని రెండు గ్రూపులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అయితే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఫొటో ఉన్న ఫ్లెక్సీలపై పేడకొట్టి.. చించివేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పుప్పాల కుమారిని దేవినేని అవినాష్ ఫైనల్ చేయడంతో అది నచ్చక మరో వర్గం ఈ చర్యలు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
ఈ వివాదం ముదిరి పంచాయితీకి దారితీసింది. చివరకు పోలీసులకు పిర్యాదు చేసుకున్నారు. పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.