Begin typing your search above and press return to search.

వైసీపీ, టీఆర్ఎస్ కొత్త ఎంపీలకు కీలక పదవులు

By:  Tupaki Desk   |   24 July 2020 10:00 AM IST
వైసీపీ, టీఆర్ఎస్ కొత్త ఎంపీలకు కీలక పదవులు
X
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీలకు కీలక పదవులు కేటాయిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎన్నికైన నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు కీలక పదవులు లభించాయి.ఈ నలుగురితోపాటు దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాలు, పార్టీల నుంచి ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యసభ సభ్యులకు పదవులను కేటాయించారు. వివిధ స్టాండింగ్ కమిటీల్లో సభ్యత్వాన్ని కల్పించారు.

వైసీపీ నుంచి ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు కీలకమైన పరిశ్రమల స్థాయి సంఘంలో సభ్యుడిగా చేర్చారు.ఇక మోపిదేవి వెంకటరమణకు బొగ్గు, ఉక్కుశాఖకు సంబంధించిన స్టాండింగ్ కమిటీలో సభ్యత్వాన్ని కల్పించారు. అయోధ్య రామిరెడ్డిని పట్టణాభివృద్ధి స్థాయి సంఘంలో సభ్యుడిగా నియమించారు.ఐటీ స్టాండింగ్ కమిటీలో పరిమళ్ నత్వానీకి సభ్యత్వాన్ని కల్పించారు.

ఇక తెలంగాణ నుంచి టీఆర్ఎస్ తరుఫున ఎన్నికైన కే కేశవరావుకు ఏకంగా పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మరో టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డిని ప్రజా ఫిర్యాదు చట్టం, న్యాయవ్యవస్థకు సంబంధించిన కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు నామినేట్ చేసినట్టు రాజ్యసభ బులిటెన్ విడుదల చేసింది.