Begin typing your search above and press return to search.

ఫ్యూచర్ ప్లాన్స్ తో వైసీపీ సీనియర్స్ ....?

By:  Tupaki Desk   |   17 Feb 2022 9:16 AM IST
ఫ్యూచర్ ప్లాన్స్ తో వైసీపీ సీనియర్స్ ....?
X
వైసీపీలో సీనియర్ నేతలు ఎదురుచూపులకు మూడేళ్ళ టైమ్ కావస్తోంది. తమనే మంత్రులుగా చేస్తారని, పెద్ద పదవులు కట్టబెడతారని ఆశించిన వారంతా జగన్ మంత్రివర్గాన్ని చూసి షాక్ తిన్నారు. అయితే నాడు జగన్ ఇచ్చిన హామీ మేరకు సగం పాలన పూర్తి అయ్యాక తమకూ ఇస్తారు అన్న ఆశలతో ఇన్నాళ్ళూ నెట్టుకువచ్చారు. ఇపుడు చూస్తే మాత్రం అవన్నీ ఆవిరే అని తేలిపోతోందిట.

ఇంకో వైపు చూసుకుంటే జగన్ మంత్రి వర్గ విస్తరణలో తమకు చాన్స్ లేదని రాదని తేల్చేసుకుంటున్నారుట. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దాయన, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయణరెడ్డి అయితే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.

ఆయన ఈసారి కచ్చితంగా పార్టీ మారుతారు అని అంటున్నారు. కొత్త జిల్లాల విభజనతో ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి శ్రీ బాలాజీ జిల్లాకు మార్చేశారు. దాంతో నెల్లూరుతో సుదీర్ఘ కాలం అనుబంధం ఉన్న ఆనం వారికి ఇది చికాకుని తెప్పించే పరిణామంగా ఉంది.

ఇక ఆయన వెంకటగిరినే నమ్ముకుని రాజకీయాలు చేయాలీ అంటే కనుక కచ్చితంగా శ్రీ బాలాజీ జిల్లాకే వెళ్ళాలి. నెల్లూరుతో పూర్తిగా కటీఫ్ అనేయాలి. కానీ ఆనం కి నెల్లూరు రూరల్, అర్బన్ , అత్మకూరు అసెంబ్లీ సీట్లలో గట్టి పట్టు ఉంది. దాంతో అక్కడ నుంచి పోటీ చేయడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన ఈ మూడు సీట్ల మీదనే కన్ను వేశారు. అయితే నెల్లూరు రూరల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు.

అలాగే నెల్లూరు అర్బన్ లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే క్యాండిడేట్. ఇందులో రెండవ మాటకు అసలు తావు లేదు. ఇక ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతం రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్. అలా చూసుకుటే ఈ మూడు సీట్లలోనూ ఆనం కి చాన్స్ ఇచ్చే సీన్ లేదని అంటున్నారు.

దాంతోనే ఆయన పార్టీ మారి అయినా ఈ మూడింటిలో తాను తన వారూ పోటీకి స్కెచ్ వేస్తున్నారుట. అంటే ఆయన ఇపుడు సైలెంట్ గా ఉన్న సరైన టైమ్ లో పెదవి విప్పుతారు అంటున్నారు.

మరో వైపు చూస్తే శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తే ఓడిపోతాను అన్న లెక్కలతో నరసన్నపేట నుంచి పోటీకి దిగుతారు అంటున్నారు.

అక్కడ ఆయన సొంత అన్నయ్య క్రిష్ణదాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా జగన్ క్రిష్ణ దాస్ ని కాదని ధర్మానకు టికెట్ ఇవ్వరని అంటున్నారు. అపుడు ఆయన ఏం చేస్తారో చూడాలి. ఆయన కూడా తనకు మంత్రి పదవి వస్తుంది అన్న ఆశలేవీ లేవు అంటున్నారుట.

ఇలా కనుక చూస్తే చాలా మంది సీనియర్లు తమకు పదవులు రావని డిసైడ్ అయిపోయి భవిష్యత్తు ఆలోచనల్లో మునిగి తేలుతున్నారు అంటున్నారు. అలా ఉత్తరాంధ్రా నుంచి మొదలుపెడితే గోదావరి, కోస్తా జిల్లాల దాకా వచ్చే ఎన్నికల మీదనే చర్చట.

అంటే మంత్రి పదవులు ఇపుడు సీనియర్ల ప్రయారిటీ కాదనే అంటున్నారు. మొత్తానికి కొత్త జిల్లాల మీద పూర్తి అధికారిక ప్రకటన తరువాత సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీదనే వైసీపీ రాజకీయం ఉంటుంది అంటున్నారు.