Begin typing your search above and press return to search.
ఇంటర్నల్ టాక్ అదే సార్... అధిష్టానానికి వైసీపీ నేతల ఫిర్యాదు!!
By: Tupaki Desk | 9 Dec 2021 5:03 PM ISTఇంటర్నల్ టాక్ అదే సార్..!-ఇదీ ఇప్పుడు వైసీపీ సీనియర్లు.. అధిష్టానానికి చెబుతున్న మాట. ఎం దుకిలా జరుగుతోంది ? ఎందుకు ఇలా చెబుతున్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం పై ఒకవైపు.. ప్రధాన ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అదే విధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రభుత్వం పై ఉద్యమాలు చేస్తున్నారు. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో విపక్ష పార్టీ నేతలు.. దూకుడుగా ఉంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎవరూ ముందుకురావడంలేదు. పోనీ.. అక్కడ పార్టీ నేతలు లేరా? అంటే ఉన్నారు.
అయినప్పటికీ.. ఎవరూ ముందుకు రావడం లేదు. అదే సమయం లో వైసీపీ నేతలు.. కూడా దూకుడు చూపించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే విషయం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన పార్టీ అధిష్టానం.. సహా కీలక సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది.
కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. వైసీపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడ ఏం జరుగుతోందనే వాదన తెరమీదికి వస్తోంది. దీనిపై దృష్టిపెట్టగా.. ఇక్కడ వైసీపీ నేతలు.. టీడీపీ నేతలు కలిసిపోయారని.. పైకి మాత్రం దూరంగా ఉన్నట్టుగా కనిపించినా.. లోలోన మాత్రం కలిసిపోయి.. పనులు చేస్తున్నారని అంటున్నారు.
వీరిలో బంధుత్వాలు ఉన్నవారు కూడా ఉన్నారని.. చెబుతున్నారు. ఇదే విషయాన్ని.. పార్టీ అధిష్టానం వరకు కూడా.. వైసీపీ సీనియర్లు తీసుకువెళ్లారని.. ``అవును సార్.. అక్కడ ఇంటర్నల్‌గా అదే జరుగుతోంది. అందుకే.. అక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా సరిగా జరగడం లేదు.`` అని సమాచారం అందించినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. చర్యలు తీసుకునేందుకు పార్టీ అదిష్టానం రెడీ అవుతోందని అంటున్నారు పరిశీలకులు.