Begin typing your search above and press return to search.

విశాఖ టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ సర్కార్ ఝలక్

By:  Tupaki Desk   |   20 Dec 2020 2:40 PM IST
విశాఖ టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ సర్కార్ ఝలక్
X
వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి లూప్ హోల్స్ పై దాడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చంద్రబాబు హయాంలో ఆక్రమణలు చేసిన కొంత మంది నేతలను టార్గెట్ చేసిన వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడు పరిపాలన రాజధాని విశాఖలో అక్రమాలను ఏరివేస్తోంది.

తాజాగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎమ్మెల్యేకు చెందిన స్థలంలో ఆరు సెంట్లు గెడ్డ పోరంబోకు భూమిని కలుపుకున్నట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉదయాన్నే ప్రొక్లైనర్ తో నిర్మాణాలను తొలగి౦చి హద్దులను ఏర్పాటు చేశారు రెవిన్యూ శాఖ అధికారులు. స్థలంలో ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. ఋషికొండ సర్వేనెంబర్ 21లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్డు, కాంపౌండ్ వాలు నిర్మాణం చేసినట్టు తేల్చి ఈ చర్య తీసుకున్నారు.

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు గంటా సహా టీడీపీ నేతల కబంధ హస్తల్లో ఉన్న భూములను విశాఖ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు కోర్టుకు వెళ్లారు. పరిపాలన రాజధానిలో ప్రభుత్వ భూముల లెక్క తేల్చేందుకు సర్కార్ సీరియస్ గా ముందుకెళుతోంది. ఆక్రమణలను స్వాధీనం చేసుకుంటోంది.