Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీలూ.. మీ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌లు అడ‌గండి ప్లీజ్‌!

By:  Tupaki Desk   |   14 Dec 2021 9:00 AM IST
వైసీపీ ఎంపీలూ.. మీ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌లు అడ‌గండి ప్లీజ్‌!
X
`వైసీపీ ఎంపీలూ.. రాష్ట్రం గురించి ప‌ట్టించుకోండ‌య్యా!`.. ``వైసీపీ ఎంపీలూ.. హోదా మ‌రిచిపోయారా? ఏంట‌య్యా?. క‌నీసం రాష్ట్ర స‌మ‌స్య‌లు కూడా ప‌ట్టించుకోపోతే.. ఎట్ట‌య్యా?``.. ఇదీ.. ఇప్పుడు ఎవ‌రిని క‌దిపినా వినిపిస్తున్న మాట‌.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ ఎంపీల్లో ఒక్క‌రం టే ఒక్కరు కూడా నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తు న్నాయి. దీంతో కీల‌క‌మైన అనేక స‌మ‌స్య‌లు.. అలానే ఉండిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి వైసీపీకి ఉన్న మెజారిటీ అంతా ఇంతా కాదు. ఏకంగా.. పాతిక మందికి 22 మందిని వైసీపీకి ప్ర‌జ‌లు అప్ప‌గించారు. గ‌త పాద‌య‌త్ర స‌మ‌యంలో జగ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు.. పాతిక మంది ఎంపీల‌ను గెలిపి స్తే.. ప్ర‌త్యేక హోదా స‌హా.. అన్ని విభ‌జ‌న హామీల‌ను సాధిస్తామ‌న్నారు.

బ‌హుశ ప్ర‌జ‌లు ఇదే జ‌రిగితే బా గుంటుంద‌ని అనుకున్నారో.. ఏమో.. మొత్తంగా 22 మంది ఎంపీల‌ను వైసీపీకి గెలిపించారు. వారిలో కొత్త‌పా త అంద‌రూ ఉన్నారు. పైగా వారు గెలిచి కూడా రెండున్న‌రేళ్ల గ‌డువు కూడా అయిపోయింది. అయి తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇది మేం తెచ్చాం! అని గుండెల‌పై చేయి వేసుకుని చెప్పుకొనే రేంజ్‌లో ఏమీ సాధించ‌లేక పోయారు.

పోనీ.. క‌రోనాతో కొంత స‌మ‌యం పోయింద‌ని అనుకున్నా.. మ‌రి మిగిలిన స‌మ‌యంలో అయినా.. కేంద్రా న్ని ప్ర‌శ్నించాలి క‌దా? పార్ల‌మెంటులో నిర్మాణాత్మ‌కంగా అయినా.. వ్య‌వ‌హ‌రించాలి క‌దా? కానీ, ఇలా ఏ ఒక్క‌రూ వ్య‌వ‌హ‌రించిన పాపాన పోలేద‌ని వైసీపీకి చెందిన కొంత‌రు త‌ట‌స్థులు గుస‌గుస‌లాడుతున్నారు.

ఎవ‌రి అజెండా వారికి ఉంద‌ని.. ఎవ‌రి దారిలో వారున‌డుస్తున్నార‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శలు కూడా వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు ఎంపీలు.. పార్ల‌మెంటులో మేం అధిసాధించాం.. ఇది సాధించాం.. అంత సేపు మాట్లాడాం.. ఇంత సేపు మాట్లాడాం.. అని చెప్పుకొనేవారు.

ప్ర‌జ‌లు ఎక్క‌డ త‌మ‌ను నిల‌దీస్తారో.. అనే భ‌యం కూడా వారిలో క‌నిపించేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎవ‌రు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా క‌నిపి స్తోంది. ఏం మాట్లాడుతున్నారో.. వినిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ఎంపీల్లో ఏ కోశానా.. న‌యం, భ‌యం అన్న మాటే వినిపించ‌డం లేదు.

ఎవ‌రిదారిలో వారు ఉన్నారు. పోనీ..ఏపీకి స‌మ‌స్య‌లు లేవా? అంటే.. గంపెడు ఉన్నాయి. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ, వెనుక‌బ‌డిన జిల్లాలు, క‌డప ఉక్కుకు నిధులు.. రైల్వే జోన్‌.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఏపీని ప‌ట్టిపీడిస్తున్నాయి.

ఆయా అంశాల‌ను అంద‌రూ పంచుకుని నిర్మాణాత్మ‌కంగా.. 22 మంది కేంద్రంలోని బీజేపీని నిల‌దీస్తార‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తున్నారు. కానీ, ఏ ఒక్క‌రూ అలాంటి నిర్మాణాత్మ‌క పాత్ర‌ను పోషించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేశారు. పోనీ.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ని స‌మ‌స్య‌ల‌పైనైనా దృష్టి పెడుతున్నారా? అంటే అది కూడా లేదు.

కేవ‌లం.. సొంత రాజ‌కీయాలు.. లేదా తామంటే గిట్ట‌నివారిపై వార్నింగులు విసిరేందుకు మాత్ర‌మే పార్ల‌మెంటును ఉప‌యోగించుకుంటున్నార‌నే వాద‌న మేధావుల నుంచి కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా.. వైసీపీ ఎంపీలు తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.