Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి వైసీపీ ఎంపీ సంచలన ప్రతిపాదన

By:  Tupaki Desk   |   18 March 2021 2:25 PM GMT
స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి వైసీపీ ఎంపీ సంచలన ప్రతిపాదన
X
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామంటూ కేంద్రం ముందుకు పోతున్న వేళ వైసీపీ ఎంపీ మార్గాని భారత్ సంచలన ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు. ఇప్పటికే పునర్విభజన ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ పెడుతామని కేంద్రం హామీ ఇచ్చిందని.. కానీ ఇంతవరకూ ఆ దిశగా అడుగులు వేయలేదని ఎంపీ భరత్ అన్నారు.

కొత్తగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే బదులు ఇప్పటికే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్రానికి కేటాయించొచ్చు కదా అని భారత్ పార్లమెంట్ లో కేంద్రాన్ని కోరారు. ఇలా చేయడం ద్వారా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతోపాటు ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడొచ్చని రాజమండ్రి ఎంపీ కేంద్రానికి పార్లమెంట్ లో సూచించారు.

వైసీపీ ఎంపీ ప్రతిపాదనపై కేంద్రం నుంచి పార్లమెంట్ లో ఎవరూ స్పందించలేదు. ఇక ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. రెండేళ్లుగా పరిశీలించి నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నామని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బంద్ కొనసాగుతుండగా.. ఈనెల 25న బంద్ చేపట్టాలని కార్మికులు నిర్ణయించారు.