Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే vs పోలీస్ ఆఫీసర్ డిష్యూం డిష్యూం..ఎంతవరకు పోతుందో?
By: Tupaki Desk | 31 Aug 2020 11:05 AM ISTపాత పగలు ఊరికే పోవడం లేదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలకు అధికారం దక్కడం లేదా అంటే ఔననే అంటున్నాయి తాజా ఉదాహరణలు.. నాడు టీడీపీ ప్రభుత్వంలో గోసపడ్డ వైసీపీ నేతలకు నేడు వైసీపీ అధికారంలో ఉన్నా అవే కష్టాలు దాపురించాయంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పినా వినని పోలీసులు ఉన్నారిప్పుడు. దీంతో అధికారంలో ఉన్నా వేస్ట్ అన్న భావన ఆ వైసీపీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోందట..
రాయలసీమలోని ఓ జిల్లాలో పోలీస్ ఆఫీసర్ కు... ఒక సీనియర్ ఎమ్మెల్యేకు ఈ మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే అప్పుడు ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందట..
అసలు విషయానికి వస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తరువాత ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేని తొక్కేయడానికి శతవిధాలా ప్రయత్నాలు జరిగాయంట.. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన ముగ్గురు కీలక నాయకుల మీద అప్పటి టీడీపీ ఇన్ చార్జ్ పగబట్టి మరీ ‘రౌడీ షీట్’ ఓపెన్ చేయించాడనే ప్రచారం ఉంది. టీడీపీ ఇన్ చార్జులంతా ఇలాంటి కేసులన్నీ వైసీపీ నాయకుల మీద రాష్ట్ర స్థాయిలో అందరిపై ఇరికించారంట..
అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మారింది. వైసీపీ నేతలపై రౌడీ షీట్ ఎత్తివేయాలని.. ఇది కొనసాగితే మాకు ఇబ్బందిగా ఉంటుందని స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ప్రతీసారి మమ్మలను పోలీస్ స్టేషన్ కు పిలుస్తారని.. ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయి నేతలు ఒత్తిడి తెస్తుండడంతో వారంతా కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని సమాచారం.
అయితే సదరు ఎమ్మెల్యే.. మంత్రి పదవి రేసులో చివరకు ఉండి చివరి నిమిషంలో పదవిని దక్కించుకోలేకపోయారు. ఆ ఎమ్మెల్యే గత 6 నెలల నుంచి మా నేతల మీద రౌడీషీట్ ఎత్తివేయాలని.. టీడీపీ నేతలు అక్రమంగా పెట్టిన వీటిని రద్దు చేయాలని పోలీస్ ఆఫీసర్ కు ఎన్నో సార్లు విన్నవించాడట.. అయినా కూడా సదురు పోలీస్ ఆఫీసర్ స్పందించడం లేదని.. ఈ విషయంలో ఎమ్మెల్యేకు, పోలీస్ ఆఫీసర్ కు పెద్ద ఎత్తున గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది.
ఈ వివాదంలోనే ఎమ్మెల్యే, సదురు పోలీస్ అధికారి సవాళ్లు విసురుకున్నారని కూడా అనుకుంటున్నారు. మరి ఇదంతా నిజమో కాదు తెలియదు.. నియోజకవర్గంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలా సొంత ప్రభుత్వంలోనూ పనులు చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. వీరి బాధ వర్ణనాతీతంగా ఉందని వైసీపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయట..