Begin typing your search above and press return to search.

టీడీపీ కార్యాలయం కూల్చేందుకు ఆదేశాలు ఇవ్వండి !

By:  Tupaki Desk   |   28 Aug 2020 4:20 PM IST
టీడీపీ కార్యాలయం కూల్చేందుకు ఆదేశాలు ఇవ్వండి !
X
గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చి వేయడానికి ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దేశ అత్యున్యత న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ కార్యాలయం నిర్మించారని, ఆ భూ కేటాయింపును రద్దు చేయాలని పిటీషన్‌ లో పొందుపరిచారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకు కు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ 22 జూన్ 2017 లో జారీచేసిన జీవో నంబరు 228ని సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళగిరి మండలం ఆత్మకూరులోని పలు సర్వే నంబర్ల పరిధిలో టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం గత ప్రభుత్వం 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన కేటాయించిందని , నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు గత ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే , గతంలో దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో కూడా పిటీషన్ దాఖలు చేశారు. నాలుగు ఎకరాలున్న ఈ భూమిని 2017లో అప్పటి ప్రభుత్వం టీడీపీకి తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజుకిస్తూ జీవో జారీ చేసిందని పర్యావరణ చట్టాల ప్రకారం వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను నిర్మాణాలకు కేటాయించడం చట్ట విరుద్ధమని ఆళ్ల కోర్టు మెట్లు ఎక్కారు. అయితే అప్పట్లో హై కోర్ట్ మాత్రం దీనిపై ఇంతకుముందే రిట్ పిటిషన్ దాఖలయ్యిందని చెబుతూ ఆళ్ల పిటీషన్‌ ను తోసిపుచ్చింది.