Begin typing your search above and press return to search.
తాడికొండ ఎమ్మెల్యే పై మరో తిరుగుబాటు.. శ్రీదేవికి మరింత సెగ!
By: Tupaki Desk | 30 Dec 2022 8:24 PM ISTగుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీనేతల మధ్య వర్గపోరు మరోసారి భయటపడింది. వాస్తవానికి ఇక్కడి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం ఎప్పటి నుంచో వివాదంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావును ఇక్కడ ఇంచార్జ్‌గా నియమించారు. అయితే.. ఆయనను వ్యతిరేకిస్తూ.. ఏకంగా ఎమ్మెల్యేనే రోడ్డెక్కారు. ఇక, ఇప్పుడు మరోసారి.. పార్టీలో ఆమె వద్దంటూ.. వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో రోడ్డెక్కారు.
తమ ఎమ్మెల్యే ప్రవర్తనతో పార్టీకి నష్టం జరుగుతుందంటూ వైసీపీ కార్యకర్తలు విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు నినాదాలు చేశారు. ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తాడికొండ, తుళ్లూరు మండలాల స్థానిక వైసీపీ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కత్తెర సురేష్, పోచ బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఎమ్యెల్యే శ్రీదేవి మాట్లాడేందుకు సిద్ధం కాగా.. కార్యకర్తలంతా ఒక్కసారిగా పైకి లేచి శ్రీదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శ్రీదేవి ప్రవర్తనతో పార్టీకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతుందని మండిపడ్డారు.
ఆమె కార్యకర్తలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కుర్చీలు విసిరివేశారు. ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ఉద్రిక్తతగా మారడంతో, పోలీసులు కలగజేసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తల ఆగ్రహంతో, తాడికొండ ఎమ్యెల్యే శ్రీదేవి మాట్లాడకుండానే సభ నుంచి వెళ్లిపోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.