Begin typing your search above and press return to search.
రోజా పాదయాత్ర..బాబుపై ఒత్తిడికే ఈ నిర్ణయం
By: Tupaki Desk | 26 Nov 2017 6:34 PM ISTవైఎస్ఆర్‌సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తున్న రోజా ఇప్పుడు ఏకంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకు గాలేరు-నగరి ప్రాజెక్టును వేదికగా చేసుకున్నారు. తిరుమలకు పాదయాత్ర చేయనున్నారు. ఈనెల 28వతేదీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర ప్రారంభం కానుంది.
గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రోజా పాదయాత్ర చేయనున్నారు. నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర కొనసాగనుంది. ప్రభుత్వం స్పందించి గాలేరు-నగరి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని రోజా పాదయాత్ర చేయనున్నారు. కాగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ పాదయాత్ర అస్త్రంగా మారనుందని తెలుస్తోంది.